twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాయల్ ఘోష్ అబద్దాల కోరు.. బ్లాక్‌మెయిల్ చేసేందుకు కుట్ర.. అనురాగ్ కశ్యప్

    |

    ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ లైంగిక దాడి ఆరోపణలు చేయడం బాలీవుడ్‌లో సంచలనం రేపింది. ఆ తర్వాత ముంబైలోని వెర్సోవా పోలీస్2 స్టేషన్‌లో డైరెక్టర్‌పై కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం ముదిరింది. ఈ క్రమంలో పోలీసులు సమన్లు జారీ చేయగా అనురాగ్ కశ్యప్ అక్టోబర్ 1వ తేదీన వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. గురువారం ఉదయం 10.30 గంటల నుంచి 6 గంటల వరకు ఆయనను పోలీసులు ప్రశ్నించారు. ఈ క్రమంలో అనురాగ్ కశ్యప్ లాయర్ ఓ ప్రకటననను జారీ చేశారు. ఆ ప్రకటనలో ఏం చెప్పారంటే..

    ఆ సమయంలో ఇండియాలో లేరు

    ఆ సమయంలో ఇండియాలో లేరు

    నా క్లయింట్‌ అనురాగ్ కశ్యప్‌పై హీరోయిన్ పాయల్ ఘోష్ ఆరోపణలు చేసిన సమయంలో ఆయన ఇండియాలో లేరు. ఆ నెలలో ఆయన శ్రీలంకలో సినిమా షూటింగ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన రుజువులను అనురాగ్ కశ్యప్ పోలీసులు అందజేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేయాలని సూచించారు అని లాయర్ ప్రియాంక్ ఖిమానీ తన ప్రకటనలో తెలిపారు.

    పాయల్ ఘోష్ ఆరోపణల్లో వాస్తవం లేదు

    పాయల్ ఘోష్ ఆరోపణల్లో వాస్తవం లేదు

    అనురాగ్ కశ్యప్ లాయర్ ప్రియాంక విడుదల చేసిన ప్రకటనలో.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ దురుద్దేశం, తప్పుగా చేసినవేనని నా క్లయింట్ పోలీసులకు వివరించారు. పాయల్ ఘోష్ చేసిన ఆరోపణలన్నీ శుద్ద అబద్దాలు. అందుకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు అందించారు. తనపై దాడి జరిగినట్టు పాయల్ చెప్పిన సమయంలో అనురాగ్ అక్కడ లేరు అని పేర్కొన్నారు.

    పబ్లిసిటీ స్టంట్ కోసమే..

    పబ్లిసిటీ స్టంట్ కోసమే..

    అనురాగ్‌పై పాయల్ చేస్తున్న ఆరోపణలు 2013 ఆగస్టు నాటివి. దురుద్దేశపూర్వకంగా, పబ్లిసిటీ కోసం ఈ ఆరోపణలు చేశారనే విషయం స్పష్టమవుతున్నది. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని నిరూపించడానికి నా క్లయింట్ సిద్ధంగా ఉన్నారు. పాయల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదనే విషయాన్ని గట్టిగా నమ్ముతున్నాం అని అనురాగ్ తరఫున జారీ చేసిన తన ప్రకటనలో ప్రియాంక వెల్లడించారు.

    Recommended Video

    Shakeela Rasina Motta Modati Kutumba Katha Chitram Trailer
    ఆరోపణలతో అనురాగ్ తీవ్ర మనస్తాపం

    ఆరోపణలతో అనురాగ్ తీవ్ర మనస్తాపం

    తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలతో అనురాగ్ కశ్యప్ తీవ్రంగా కలత చెందుతున్నారు. నిరాధారమైన ఆరోపణలతో ఆయనతోపాటు కుటుంబం, అభిమానులు బాధలోకి కూరుకుపోయారు. వీలైనంత మేరకు న్యాయపరమైన పరిష్కారం కోసం వేచి చూస్తున్నారు. పాయల్ బయటపెట్టిన సంఘటనను తీవ్రంగా తప్పుబడుతున్నారు. మీటూ ఉద్యమంతో తనను బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నారనే భావనలో ఉన్నారు అని ప్రియాంక తన ప్రకటనలో తెలిపారు.

    English summary
    Mumbai Police summons film director Anurag Kashyap in Payal Ghosh sexual assalut case. Mumbai polices asking him to appear at Versova Police station tomorrow at 11 am, in connection with the alleged sexual assault against actor Payal Ghosh. He reched police station at 10 am and left at 6 pm. The cops are further investigating the case. Anurag lawyer released a statement that all allegations levelled against Anurag Kashyap are false and baseless.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X