»   » పెళ్ళైన తరువాత తొలి చిత్రంలోనే అభ్యంతరకరంగా ..అనుష్కకు షాక్, పాక్ లో బ్యాన్!

పెళ్ళైన తరువాత తొలి చిత్రంలోనే అభ్యంతరకరంగా ..అనుష్కకు షాక్, పాక్ లో బ్యాన్!

Subscribe to Filmibeat Telugu
Anushka Hurts Muslim Religious Views

విరాట్ కోహ్లీతో వివాహం జరిగిన తరువాత అనుష్క నటించిన తొలి చిత్రం పరి. హర్రర్ చిత్రంగా రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ పాత్రలో అనుష్క శర్మ నటించిన తొలి చిత్రం ఇది. కాగా ఈ చిత్రం ఆదిలోనే వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర ప్రదర్శనని పాకిస్తాన్ ప్రభుత్వం బ్యాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

కొత్త పెళ్లి జంట

కొత్త పెళ్లి జంట

విరాట్ కోహ్లీ,అనుష్క శర్మ ఏళ్ల తరబడి ప్రేమలో మునిగితేలాక గత ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

పెళ్లి తరువాత తొలి చిత్రం

పెళ్లి తరువాత తొలి చిత్రం

వివాహం జరిగాక అనుష్క నటించిన తొలి చిత్రం పరి. హర్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే విరాట్ తన సతీమణిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు.

 వివాదంలో పరి

వివాదంలో పరి

పరి చిత్ర విడుదల ఇండియాలో సాఫీగానే జరిగింది. కాని పాక్ లో మాత్రం ఈ చిత్రం వివాదంలో చిక్కుకుపోయింది.

అభ్యంతరకర సన్నివేశాలు

అభ్యంతరకర సన్నివేశాలు

ఈ చిత్రంలో ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగగా సన్నివేశాలు ఉన్నాయంటూ పాక్ ప్రభుత్వం పరి చిత్రంపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఖురాన్ సూక్తులతో కొన్ని సన్నివేశాలని అభ్యంతరకరంగా చిత్రీకరించారని పాక్ సెన్సార్ బోర్డు ఈ చిత్రాన్ని నిషేధించినట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఖురాన్ సూక్తులు, హిందూ మంత్రాలు

ఖురాన్ సూక్తులు, హిందూ మంత్రాలు

ఈ చిత్రంలో ఖురాన్ సూక్తులని, హిందూ మంత్రాలని మిక్స్ చేసి చేతబడులు వంటి సన్నివేశాలని చూపించారని పాక్ సెన్సార్ బోర్డు ఆరోపిస్తోంది.

English summary
Anushka Sharma movie Pari banned in Pakistan. Censors claim film is against Islamic values
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu