ముద్దులతో చంపేస్తుందబ్బా.. విరాట్, అనుష్క ఫోటో వైరల్
బాలీవుడ్ భామ అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లీ దాంపత్య జీవితం మంచి రొమాంటిక్ సాగుతుందనే విషయం మాటల్లో చెప్పనక్కర్లేదు. తనను ముద్దులతో ముంచెత్తుతున్నదన్నట్టు విరాట్ తాజాగా పోస్ట్ చేసిన ఫోటో వైరల్‌గా మారింది. మూడు నెలల క్రితం విరుష్క పెళ్లి ఇటలీలోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిలకా గోరింకల్లా చెలరేగిపోతున్నారు.

పెళ్లి తర్వాత అనుష్క, విరాట్ తమ తమ పనులతో బిజీగా మారిపోయారు. ఇటీవలే సాయీ దాగా అనే చిత్ర షూటింగ్‌లో విరివిగా పాల్గొని ముంబైకి వచ్చింది. ఆ తర్వాత తన భర్తతో మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉండగా తీసిన సెల్ఫీ ఫోటోను అనుష్క తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది.
దాదాపు 17 గంటల్లో ఆ ఫోటో 22 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. అద్భుతమైన జంట అంటూ అభిమానులు ముచ్చటపడిపోతున్నారు.


Click it and Unblock the Notifications











