»   » మరీ ఇంత చెత్తగానా? అనుష్క-విరాట్ దంపతులకు షాకిచ్చిన నెటిజన్లు!

మరీ ఇంత చెత్తగానా? అనుష్క-విరాట్ దంపతులకు షాకిచ్చిన నెటిజన్లు!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  మరీ ఇంత చెత్తగానా? అనుష్క-విరాట్ దంపతులకు షాకిచ్చిన నెటిజన్లు!

  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఒకటి పెద్ద చర్చకు దారి తీసింది. ఈ వీడియో చూసిన కొందరు అనుష్క-విరాట్ దంపతులు ప్రశంసిస్తుంటే, మరికొందరు విమర్శలకు దిగారు. అయితే చాలా మంది అనుష్క, విరాట్ దంపతులు వ్యవహరించిన తీరు బాగోలేదంటూ తప్పుబట్టారు. పబ్లిసిటీ కోసమే వీరు ఇలా చేశారంటూ కొందరు ఫైర్ అయ్యారు. మరో వైపు విరాట్, అనుష్క చేసిన పని వల్ల తన కుమారుడికి ఏదైనా హాని జరుగుతుందేమో అని ఓ తల్లి ఆందోళన వ్యక్తం చేసింది.

  ఇంతకీ ఆ వీడియోలో ఏ ముంది?

  ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.... ముంబైలో ఇటీవల అనుష్క, విరాట్ కలిసి వెలుతుంటే అర్హన్ సింగ్ అనే వ్యక్తి తన కారులో నుండి ప్లాస్టిక్ బాటిల్ రోడ్డు మీదకు విసిరేశాడు. దీంతో ఆగ్రహం చెందిన అనుష్క.... చెత్త వేయాల్సింది రోడ్డు మీద కాదు, డస్ట్ బిన్లో అంటూ క్లాస్ పీకింది. అనుష్క అతడిపై అరుస్తూ క్లాస్ పీకుతున్న వైనాన్ని విరాట్ వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘వీళ్లా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే వారిని ప్రశ్నించండి. అవగాహన కల్పించండి' అంటూ అభిమానులకు సూచించారు.

   నేను చేసింది తప్పే.. కానీ మీరు ఇంకా చెత్తగా ప్రవర్తించారు

  నేను చేసింది తప్పే.. కానీ మీరు ఇంకా చెత్తగా ప్రవర్తించారు

  అనుష్క చేత చివాట్లు తిన్న అర్హాన్‌ సింగ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో అనుష్క మీద విమర్శలు చేశాడు. ‘నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు వేసింది. ఇది మీకు మర్యాద అనిపించుకోదు' అంటూ కామెంట్ చేశారు.

   నా కుమారుడికి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి?

  నా కుమారుడికి ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి?

  ఆ తర్వాత అర్హాన్ సింగ్ తల్లి గీతాంజలి ఎలిజబెత్ కూడా అనుష్క-విరాట్ దంపతులపై మండి పడింది. తన కుమారుడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా అతడి ప్రైవసీకి భంగం కలిగించారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీని వల్ల అనుష్క, విరాట్ అభిమానులు తన కుమారుడికి హాని తలపెట్టే అవకాశం ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

  ఇది పద్దతి కాదు

  ఇది పద్దతి కాదు

  కొందరు నెటిజన్లు అనుష్క, విరాట్ పబ్లిసిటీ కోసం ఇలా చేశారని.... చెత్త రోడ్డుపై పడేసే వారిని అలా చేయకుండా అడ్డుకోవడంలో తప్పులేదు కానీ చెప్పే విధానం అది కాదు అని అంటూ మండి పడుతున్నారు.

  English summary
  Anushka Sharma and Virat Kohli had recently called out a man for littering the road in a post on Instagram. Their attempt at schooling the person has not gone down well with a section of people on social media, especially the man's mother, who has now lashed out at the couple. Although Arhhan Singh, the person in question, agreed that he had been careless, he lashed out at Virat and Anushka for not having etiquette. He also called Virat a trashy mind for making their confrontation public.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more