»   » జాన్వీ కపూర్‌ని అసభ్యంగా చూపించారు.. బూతులు తిట్టిన అర్జున్ కపూర్, చెల్లెలిపై ప్రేమ ఇలా!

జాన్వీ కపూర్‌ని అసభ్యంగా చూపించారు.. బూతులు తిట్టిన అర్జున్ కపూర్, చెల్లెలిపై ప్రేమ ఇలా!

Subscribe to Filmibeat Telugu
Arjun Kapoor Slams A Website For Its Derogatory Remarks on Janhvi Kapoor

శ్రీదేవి మరణంతో షాక్ లోకి వెళ్లిన బోనికపూర్ కుటుంబం ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి బయటకు వస్తోంది. శ్రీదేవి ఫిబ్రవరి 24 న దుబాయ్ లో అనూహ్య మరణం చెందిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మృతి మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమనే విస్మయానికి గురిచేసింది. శ్రీదేవి ఇద్దరు కుమార్తెలు జాన్వీ, ఖుషి తీవ్ర వేదనలోకి వెళ్లిపోయారు. జాన్వీ దఢక్ చిత్ర షూటింగ్ తో దుఃఖం నుంచి బయటకు వస్తోంది. శ్రీదేవి ఉన్న సమయంలో అర్జున్ కపూర్ తో మాటలు లేవు . కనీసం తండ్రి బోనికపూర్ తో సైతం అర్జున్ కపూర్ అంటి ముట్టనట్లుగా ఉండేవారు. కానీ శ్రీదేవి మరణం తరువాత పరిస్థితి మారింది. బోనికపూర్, అర్జున్ కపూర్ మధ్య బంధం పెరిగింది. జాన్వీ, ఖుషి లని కూడా అర్జున్ కపూర్ చెల్లెళ్లుగా చేరదీస్తున్నాడు. ఇటీవల బోని తన కుమార్తెలతో కలసి అర్జున్ కపూర్ నివాసానికి వెళ్ళాడు.

దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే

దుఃఖం నుంచి ఇప్పుడిప్పుడే

శ్రీదేవి మరణంతో జాన్వీ, ఖుషి వేదనలోకి వెళ్లిపోయారు. అప్పటివరకు వారు తల్లిచాటు బిడ్డలుగా పెరిగారు. శ్రీదేవి అనూహ్యంగా మృతి చెందడంతో కుమార్తెలు ఇద్దరూ దిక్కు తోచని స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ దుఃఖం నుంచి వారు ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు.

జాన్వీ దఢక్ చిత్రంతో

జాన్వీ దఢక్ చిత్రంతో

జాన్వీ కపూర్ దఢక్ చిత్రంతో బిజీగా మారి తల్లి మృతిచెందిన భాద నుంచి కొంత మేరకు బయట పడగలుగుతోంది.

కొడుకుతో సన్నిహితంగా

కొడుకుతో సన్నిహితంగా


శ్రీదేవి ఉన్నత వరకు బోని కుటుంబానికి అర్జున్ కపూర్ కు మధ్య మాటలు లేవు. అర్జున్ కపూర్ కనీసం తన తండ్రి బోనితో కూడా ఆంటీ ముట్టనట్టుగా వ్యవహరించేవాడు. కానీ ఇప్పుడు వారి మధ్య బంధం బాగా బలపడింది.

తరచుగా రాకపోకలు

తరచుగా రాకపోకలు

బోనికపూర్ తరచుగా తన కుమార్తెలతో అర్జున్ కపూర్ నివాసానికి వచ్చి వెళుతున్నారు. శ్రీదేవి మృత తరువాత బోని కపూర్ పలు పర్యాయాలు అర్జున్ కపూర్ నివాసానికి వచ్చినట్లు తెలుస్తోంది.

అప్పటి నుంచే

అప్పటి నుంచే

శ్రీదేవి మృతి తరువాత అర్జున్ కపూర్ అంత్యక్రియల కార్యక్రమాన్ని దగ్గరుండి మరి జరిపించాడు. అర్జున్ కపూర్ సోదరి అన్షుల చెల్లెల్లు జాన్వీ, ఖుషికి అండగా నిలిచింది. అప్పటి నుంచే వీరి మధ్య కుటుంబబంధం పెరిగింది.

చెల్లెళ్లకు అండగా

చెల్లెళ్లకు అండగా

తల్లిని కోల్పోయిన జాన్వీ, ఖుషిని అర్జున్ కపూర్ బాధ్యతగల అన్నగా చేరదీస్తున్నాడు. వారికీ అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తన్నాడు. అన్షులా కూడా వారికీ అండగా నిలుస్తోంది.

జాన్విని అసభ్యంగా

జాన్విని అసభ్యంగా

ఇటీవల బోనీ కపూర్ తన కుమార్తెలతో అర్జున్ కపూర్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో జాన్వీ వేసుకున్న డ్రెస్ ని హైలైట్ చేస్తూ ఓ వెబ్ సైట్ అసభ్యంగా ఫోటో చిత్రీకరించింది.

బూతులు తిట్టిన అర్జున్ కపూర్

ఈ విషయం అర్జున్ కపూర్ దృష్టికి రావడంతో అతడు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సదరు వెబ్ సైట్ ని బూతులు తిడుతూ తన ఆగ్రహం వ్యక్తం చేసాడు. మీరు చేసింది సిగ్గుమాలిన చర్య అంటూ బుద్ది చెప్పాడు. యువతీ పట్ల ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ అర్జున్ కపూర్ ప్రశ్నించడం విశేషం.

చెల్లెళ్లపై ప్రేమ ఇలా

చెల్లెళ్లపై ప్రేమ ఇలా

అర్జున్ కపూర్ ఘాటు రియాక్షన్ కు నెటిజన్ల నుంచి మద్దత్తు లభిస్తోంది. చెల్లెళ్లపై అర్జున్ కపూర్ ఇలా తన ప్రేమని చాటుకున్నాడని అర్జున్ కపూర్ అభిమానులు అంటున్నారు.

English summary
Arjun Kapoor slams a website for its derogatory remarks on Janhvi Kapoor. Recently Boney Kapoor went to Arjun Kapoor house
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X