»   » సల్మాన్ ఖాన్ చెల్లెలు ఇంత ఎమోషనల్‌గా.. వారిని అంధుల్ని చేయాలి!

సల్మాన్ ఖాన్ చెల్లెలు ఇంత ఎమోషనల్‌గా.. వారిని అంధుల్ని చేయాలి!

Subscribe to Filmibeat Telugu

సల్మాన్ ఖాన్ చెల్లెలు అర్పిత ఖాన్ తాజగా సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇంస్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్గా మారింది. సల్మాన్ ఖాన్ ని ఉద్దేశించి ఆమె ఎమోషనల్ గా కామెంట్స్ పెట్టింది. నా బలం, బలహీనత, నా సంతోషం, నా ప్రపంచం అన్ని నువ్వే. నీ విజయాన్ని చూసి ఓర్వలేని వారంతా చల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా.

నీపై చెడు ప్రభావం పడకుండా మరింత సంతషంగా ఉండాలి. నిన్నుద్వేషించే వారిని నీ విజయం, మంచి తనం అంధుల్ని చేయాలి అని అర్పిత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. 1998 లో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలని వేటాడిన కేసులో జోధ్ పూర్ న్యాయస్థానం ఐదేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. రెండు రోజుల అనంతరం సల్మాన్ ఖాన్ కు బెయిల్ లభించింది. సల్మాన్ కు శిక్ష ఖరారైన తరువాత అతడి కుటుంబం తీవ్రమైన వేదనలో మునిగిన సంగతి తెలిసిందే.

Arpita Khan post on her brother Salman Khan

కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఊరట లభించింది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తాను కమిటై ఉన్న చిత్రాలని పూర్తి చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం రేస్ 3 చిత్రంలో నటిస్తున్నాడు.

English summary
Arpita Khan post on her brother Salman Khan. Instagram post goes viral in social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X