twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్టికల్ 370 రద్దు: ఇండియన్ సినిమాలపై పాకిస్థాన్లో నిషేదం

    |

    నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం విషయంలో 70 ఏళ్లుగా కొనసాగుతున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం తర్వాత అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పాకిస్థాన్ ఇండియాతో సంబంధాలను తెంచుకుంది. ఇందులో భాగంగా భారతీయ సినిమాలపై కూడా నిషేధం విధించింది.

    అయితే భారత సినిమాలపై నిషేదం విధించడం ద్వారా నష్టపోయేది పాకిస్థానే అని అంటున్నారు విశ్లేషకులు. దీని వల్ల పాకిస్థాన్‌కు ఎంటర్టెన్మెంట్ టాక్స్ రూపంలో వచ్చే దాదాపు రూ. 100 కోట్లకు గండి పడబోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నమాట. పాకిస్థాన్ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ సినీ పరిశ్రమపై ఎలాంటి ప్రభావం చూపబోదుని అంటున్నారు. మరో వైపు భారత్‌లో పాకిస్థాన్ నటీనటులపై ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. పుల్వామా దాడి తర్వాత నుంచే ఈ నిషేదం కొనసాగుతోంది.

     Article 370 effect: Pakistan bans Indian movies

    ఆర్టికల్ 370 అనేది పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, దీన్ని సాకుగా చూపి భారత్‌తో సన్నిహిత సంబంధాలను తెంచుకోవాలనుకోవడం సరైన నిర్ణయం కాదని విదేశాంగ శాఖ పాకిస్థాన్‌కు సూచించింది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ అనవసరంగా తలదూర్చాలని చూస్తోందని హెచ్చరించింది.

    English summary
    After Indian government announced the scrapping of Article 370 in the state of Jammu and Kashmir, Pakistan has announced a ban on Indian movies in cinemas in the country.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X