For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  క్యాన్సర్‌తో ఇర్ఫాన్ ఖాన్ జీవన్మరణ పోరాటం... కోలుకున్నాడా? ఎయిర్‌పోర్టులో హ్యాపీగా!

  |
  Irrfan Khan Treatment Going Well, Recently Spotted At Mumbai Airport || Filmibeat Telugu

  ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు అరుదైన క్యాన్సర్ సోకడంతో కొంతకాలంగా లండన్లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధితో జీవన్మరణ పోరాటం చేస్తున్న ఆయన ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదనే రూమర్స్ సైతం గతంలో వినిపించాయి.

  క్యాన్సర్‌తో ఇర్ఫాన్ ఖాన్ చేసిన పోరాటంలో విజయం దశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన ముంబై ఎయిర్ పోర్టులో దర్శనమివ్వడంతో ఆయన ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్నట్లు అంతా చర్చించుకుంటున్నారు.

  హ్యాపీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఇర్ఫాన్ ఖాన్

  హ్యాపీగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఇర్ఫాన్ ఖాన్

  క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నప్పటి నుంచి లో ప్రొఫైల్ మెయింటేన్ చేస్తున్న ఇర్ఫాన్ ఆ మధ్య ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఇండియా వచ్చి వెంటనే తిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో మరోసారి ఇర్ఫాన్ ఖాన్ దర్శనమిచ్చారు. జీన్స్, పింక్ టీషర్ట్, పూల చొక్కా వేసుకున్న అతడు అక్కడ ఉన్న ఫోటో గ్రాఫర్లకు హ్యాపీగా ఫోజులు ఇచ్చారు.

  కోలుకున్న ఇర్ఫాన్ ఖాన్, ఇక సినిమాల్లో బిజీ?

  కోలుకున్న ఇర్ఫాన్ ఖాన్, ఇక సినిమాల్లో బిజీ?

  ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన హిందీ మీడియం సీక్వెల్‌లో కూడా నటించబోతున్నారట. ఇర్ఫాన్ ఫ్రెండ్ తిగ్మాన్షు ధూలియా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘అతడిని ఇండియా తిరిగి వచ్చిన తర్వాత కలిశాను. ఇపుడు ఆరోగ్యంగా ఉన్నాడు. త్వరలోనే హిందీ మీడియాం సీక్వెల్ చేయబోతున్నట్లు చెప్పాడు' అని తెలిపారు.

  నిర్మాత దినేష్ విజన్ ఏమంటున్నారంటే...

  నిర్మాత దినేష్ విజన్ ఏమంటున్నారంటే...

  ‘‘ఇర్ఫాన్ ఖాన్ మళ్లీ సినిమాల్లో నటించబోతున్నారు. మేము హిందీ మీడియం 2 స్క్రిప్టుకు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాం. ఆ ప్రాజెక్టు గురించి ఇంత ముందుగా మాట్లడలేం. మరో రెండు నెలల్లో దీనిపై క్లారిటీ ఇస్తాం. అయితే ఈ ఏడాదే నిర్మించాలనుకుంటున్నాం. అతడు(ఇర్ఫాన్) తిరిగి వస్తాడు. కంఫర్టుగా ఉండేలా సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తాం. త్వరలోనే అన్ని విషయాలు అఫీషియల్‌గా ప్రకటిస్తాం.'' అని నిర్మాత దినేష్ విజన్ తెలిపారు.

  ‘హిందీ మీడియం 2'లో కరీనా కపూర్

  ‘హిందీ మీడియం 2'లో కరీనా కపూర్

  బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘హిందీ మీడియం 2'లో కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చిత్ర బృందం నుంచి అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

  గతంలో రహస్యంగా ఇండియా వచ్చి వెళ్లిన ఇర్ఫాన్ ఖాన్

  గతంలో రహస్యంగా ఇండియా వచ్చి వెళ్లిన ఇర్ఫాన్ ఖాన్

  గతేడాది నంబర్లో ఇర్ఫాన్ ఖాన్ రహస్యంగా ఇండియా వచ్చి రెండు రోజులు ఇక్కడ గడిపిన అనంతరం తిరిగి చికిత్స నిమిత్తం యూకె వెళ్లారు. తన విజిట్ విషయం ఎవరికీ తెలియకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. నాసిక్ త్రయంబకేశ్వర్‌లోని శివ టెంపుల్‌లో పూజలు నిర్వహించేందుకే ఇర్ఫాన్ ఖాన్ ఇండియా వచ్చినట్లు, పండితుల సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి హవన్ పూజ నిర్వహించిన అనంతరం తిరిగి లండన్ వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

  అరుదైన వ్యాధి

  అరుదైన వ్యాధి

  ఇర్ఫాన్‌ ఖాన్‌ అత్యంత అరుదైన ‘న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌' బారిన పడ్డారు. న్యూరో ఎండోక్రైన్‌ కేన్సర్‌ లక్షమందిలో ముగ్గురు నుంచి ఐదుగురికి వస్తుంది. గత కొన్ని నెలలుగా ఇర్ఫాన్ ఖాన్ ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.

  English summary
  Last year, Irrfan Khan left everyone shocked when he revealed that he has been diagnosed with high-grade neuroendocrine tumour. Post releasing an official statement, the actor flew to London to undergo treatment for the same. The actor flew back to India in March this year and was recently spotted at the Mumbai airport. Here's a picture of him.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more