twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పార్టీకి వెళ్ళిన పాపానికి సూసైడ్.. ఆ కేసులో ఇరికిస్తారనే భయంతో నటి ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

    |

    2021 లో చాలా మంది తారలు ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఈ ఏడాది ముగిసి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేందుకు మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉండగా సినీ ప్రపంచం నుంచి మరో బ్యాడ్ న్యూస్ వచ్చింది. 28 ఏళ్ల నటి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

     వేధింపులే

    వేధింపులే

    నకిలీ అధికారుల వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఎన్‌సిబి అధికారిగామారిన ఇద్దరు వ్యక్తులచే బెదిరింపులకు గురై ఆత్మహత్య చేసుకుంది. నటిని ఇరికిస్తానని బెదిరించడంతో నటి భయంతో సూసైడ్ చేసుకుంది.

    తీవ్ర మనస్తాపానికి గురై

    తీవ్ర మనస్తాపానికి గురై

    అందుతున్న సమాచారం ప్రకారం, 28 సంవత్సరాలు వయసున్న భోజ్‌పురి నటి ఇటీవల ముగ్గురు స్నేహితులతో కలిసి హోటల్‌లో పార్టీకి హాజరైందని, అక్కడ ఎన్‌సిబి అధికారులుగా నటిస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమె వద్దకు వెళ్లి డ్రగ్స్ తీసుకున్నందుకు అరెస్టు చేస్తామని చెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నటి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత నటి డిసెంబర్ 23న జోగేశ్వరి (పశ్చిమ)లోని తన అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

    40 లక్షలు డిమాండ్ చేయగా

    40 లక్షలు డిమాండ్ చేయగా


    మృతురాలు సహా ఆమె స్నేహితులు భయాందోళనకు గురై ఎన్‌సిబి అధికారులుగా నటిస్తున్న ఇద్దరిని సమస్యను పరిష్కరించాలని కోరినట్లు అధికారులు తెలిపారు. నిందితులు రూ.40 లక్షలు డిమాండ్ చేయగా, ఎట్టకేలకు రూ.20 లక్షలకు సెటిల్ మెంట్ చేసుకున్నారు.

    ప్రాథమికంగా ADR

    ప్రాథమికంగా ADR

    ఈ మొత్తం విషయంపై డీసీపీ మంజునాథ్ మాట్లాడుతూ- 'డిసెంబర్ 23న పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య కేసు నమోదైంది. ఇందులో ఓ మహిళ మెడకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అంబోలి పోలీసులు ప్రాథమికంగా ADRను నమోదు చేశారు మరియు ప్రాథమిక విచారణలో డిసెంబర్ 20వ తేదీన ఈ మహిళ తన సహోద్యోగులతో కలిసి హోటల్‌లో పార్టీ చేసుకుంటోందని, అక్కడ కొంతమంది వ్యక్తులు చేరుకుని ఇక్కడ NCB దాడి జరిగిందని చెప్పారు.

    20 లక్షల రూపాయలు చెల్లించాలని

    20 లక్షల రూపాయలు చెల్లించాలని

    ఈ వ్యక్తులు తమను ఎన్‌సీబీ అధికారులుగా పేర్కొంటూ నటిపై కేసు పెట్టడం గురించి మాట్లాడారు. ఒకవేళ కేసు పెట్టవద్దని మహిళ కోరితే 20 లక్షల రూపాయలు చెల్లించాలని అందులో ఒకరు తెలిపారు. ఈ నకిలీ అధికారులు ఆ మహిళకు రోజూ ఫోన్ చేసి వేధించడం ప్రారంభించారు. దీంతో మనస్తాపానికి గురైన మహిళ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఇద్దరు నిందితులను ఐపిసి సెక్షన్ 306, 170, 420, 384, 388 మరియు 389, 120 బి కింద అరెస్టు చేశారు. ఇక ఇప్పుడు తదుపరి విచారణ కొనసాగుతోంది.

    English summary
    Bhojpuri Actress Blackmailed By Fake NCB Officers Killed herSelf.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X