For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుశాంత్.. ఆ ఒక్క మాట చెబితే బాగుండేది.. కంటతడి పెట్టించేలా భూమిక లేఖ

  |

  యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై తీవ్ర దిగ్బ్రాంతికి గురైన భూమికా చావ్లా మరోసారి భావోద్వేగమైన లేఖను రాశారు. జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకొన్న తర్వాత భూమిక రాసిన రెండో లేఖ ఇది. తాజా లేఖ మరోసారి సుశాంత్ అభిమానులను విషాదంలో ముంచెత్తేలా ఉంది. జయపజయాలు జీవితంలో ఓ భాగం.. అంత మాత్రాన లైఫ్‌ను అర్ధాంతరంగా ముగించడం భావ్యం కాదు అంటూ భూమిక తన లేఖలో పేర్కొన్నారు.

  Recommended Video

  Sushant Singh Rajput : Sushant సూసైడ్ పై కంటతడి పెట్టించేలా Bhumika లేఖ!
  నీతో అనుబంధం తక్కువే.. కానీ

  నీతో అనుబంధం తక్కువే.. కానీ

  సుశాంత్ నీవు ఈ లోకాన్ని వీడి ఇప్పటికి 20 రోజులు. నీవు లేవనే బాధతో ప్రతీ రోజు నిద్ర లేస్తున్నాను. నీతో నాకు ఉన్న అనుబంధం చాలా తక్కువే. ఎంఎస్ ధోని చిత్రంలో నీతో కలిసి కొద్ది రోజులే నటించాను. కానీ నీతో ఏర్పడిన అనుబంధాన్ని తెంచుకోలేకపోతున్నాను అని భూమిక పేర్కొన్నారు. అవకాశాలు చేజారితే దానికి సరిపోననే మనసుకు సర్ధి చెప్పుకొంటే ఆ బాధ తగ్గుతుంది. పాజిటివ్‌గా ఉండే నీవు ఇలాంటి నిర్ణయం తీసుకొంటావని ఊహించలేదన్నారు.

  నీ బాధ ఏంటో అర్ధమయ్యేది..

  నీ బాధ ఏంటో అర్ధమయ్యేది..

  నీవు ఇలాంటి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకొనే ముందు దానికి కారణం డిప్రెషనా? లేదా వ్యక్తిగత కారణాలా? అనే విషయాన్ని కనీసం చెప్పి ఉంటే మాకు నీ బాధ అర్ధం అయ్యేది. ఒకవేళ నీ డిప్రెషన్ కారణం ప్రొఫెషనల్‌ విషయాలు అయితే అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే నీవు ఎన్నో విజయాలను చూశావు. ఇక్కడ బతకడం అంత ఈజీ కాదనే విషయం నాకు తెలిసిందే అని భూమిక తన లేఖలో వెల్లడించారు.

  నేను 50 సినిమాలు చేసిన తర్వాత కూడా

  నేను 50 సినిమాలు చేసిన తర్వాత కూడా

  ఇండస్ట్రీలో అవుట్ సైడరా? లేదా ఇన్‌సైడారా అనే విషయాలు పక్కన పెడితే.. నేను 50 సినిమాలు చేసిన తర్వాత కూడా అవకాశాల కోసం ఎవరినో ఒకరిని సంప్రదిస్తూనే ఉన్నాను. ఇండస్ట్రీలో ఆఫర్లు చేజిక్కించుకోవడమనేది అంత సులభం కాదనే విషయం తెలిసిందే. అయినా నాకు ఇప్పటికీ ఏదో ఒక అవకాశం వస్తూనే ఉంది. ఏదో మంచి జరుగుతుందనే భావనతో ముందుకు వెళ్లడం తప్ప మరోటి లేదు అని భూమిక తన లేఖలో తెలిపారు.

  నీకు ఆ పరిస్థితి లేదుగా

  నీకు ఆ పరిస్థితి లేదుగా

  సినీ జీవితాన్ని గొప్పగా ఆశించి వచ్చే మనలాంటి వాళ్లకు ముంబై నగరం మన స్వప్నాలను పూరిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇస్తుంది. కొన్నిసార్లు మనల్ని అనామకులుగా మారుస్తుంది. లక్షలాది మంది కోరికల దాహాన్ని కూడా ఏదో రూపంలో తీర్చుతుంది. చివరకు సాధ్యపడదనే నిర్ణయించుకొన్న తర్వాతే జీవితంపై ఆశలు వదులుకోవాలి. నీకు ఆ పరిస్థితి లేదుగా.. మరి ఎందుకు ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నావనే ఒక్క మాట చెబితే బాగుండు అని భూమిక తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

  English summary
  Actress Bhumika Chawla writes emotional tweet about Sushant Singh Rajput suicide. Bhumika Chawla writes that She begins, "It's been almost 20 days ... and I wake up thinking of you . Still wondering what it was ... one only shared the screen space as a character briefly but still associated together.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X