For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హేటర్స్‌కి నెవర్‌బిఫోర్ ట్రీట్మెంట్.. బెడ్ మీద బికినీతో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ!

  |

  'బిగ్ బాస్' కంటెస్టెంట్ కాశ్మీరా షా అంటే బాలీవుడ్ లో తెలియని వారుండరు. హాస్యనటుడు-నటుడు కృష్ణ అభిషేక్ భార్య అయిన కాశ్మీరా షా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన నటన, హావభావాలతో... అందరినీ ఆకట్టుకునే ఈ బ్యూటీ. గత ఏడాది బిగ్ బాస్ లో కనిపించి అలరించింది. ఈ మధ్య ఈ భామలో ఫ్యాన్స్ ఊహించని విధంగా బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అక్కడితో ఆగకుండా వరుసగా గ్లామర్‌తో అభిమానుల మతులు పోగొడుతోంది. ఆమె తాజాగా తనను ట్రోల్ చేసిన హేటర్స్‌కి నెవర్‌బిఫోర్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

  బికినీలో దర్శనం

  బికినీలో దర్శనం


  ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తాను కొంత లావుగా ఉన్నప్పుడు తనని ట్రోల్ చేసిన అందరికీ షాక్ ఇస్తూ హాట్ బికినీలో దర్శనం ఇచ్చింది. ఆమె వయస్సు గురించి ట్రోల్ చేస్తున్న వారందరికీ ఆమె గట్టి సమాధానం ఇచ్చింది. కాశ్మీరా షా ఎర్రటి హాట్ బికినీ ధరించిన సిజ్లింగ్ ఫోటోలో రాయల్ బ్లూ శాటిన్ చొక్కా విప్పేస్తూ కనిపించింది. ఇక ఆ చొక్కా గాలికి ఎగురుతున్నట్లు కనిపిస్తోంది.

  మీ ఇష్టం వచ్చినంత ట్రోల్ చేసుకోండి

  మీ ఇష్టం వచ్చినంత ట్రోల్ చేసుకోండి


  ఈ ఫోటో షేర్ చేసిన కాశ్మీరా తన 'హేటర్స్‌' కోరుకున్నంతవరకు ట్రోల్ చేయమని సవాలు చేసింది. ఈ పోస్ట్‌ను షేర్ చేసిన ఆమె, "నాకు ఇప్పటికే చాలా మంది క్రిటిక్స్ ఉన్నారన్న ఆమె తాను మాత్రం వాళ్ళ వాదన విననని చెప్పుకొచ్చింది. కాని నేను వింటున్న అతి పెద్ద స్వరం నాదేనని ఆమె పేర్కొంది. నాకు నేనే చీర్ లీడర్ అని ఆమె పేర్కొంది. సో మీరు ట్రోల్ చేయండి ఆ తరువాత మీరు బ్రతకడానికి కూడా ఏదో ఒకటి చేయండి అంటూ సలహా ఇచ్చింది.

   సుశాంత్ మాజీ ప్రియురాలు అండ

  సుశాంత్ మాజీ ప్రియురాలు అండ

  కాశ్మీరా ఎప్పడైతే ఈ పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిందో ఆమెకు వెంటనే సపోర్ట్ కూడా లభించింది. సుశాంత్ సింగ్ రాజా పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే కాశ్మీరాకి అండగా నిలిచింది. ఆ పోస్ట్ కింద ఆమె కాశ్మీరా మీలాంటి శరీరాన్ని కలిగి ఉండాలని అందరూ కోరుకుంటారు, మోటివేటింగ్ అని కామెంట్ చేశారు.

  నెటిజన్స్ సైతం సపోర్ట్

  నెటిజన్స్ సైతం సపోర్ట్

  మరికొందరు కూడా కశ్మీరాను ట్రోల్‌ చేయకుండా ప్రశంసించారు. "వావ్ గార్జియస్ మిమ్మల్ని అందరూ అసహ్యించుకుంటారు, ఎందుకంటే వారికి మీలాంటి శరీరం లేదు" అని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. చెడు వెలుగులో వస్తువులను చూసే అలవాటు ఉన్న మూర్ఖుల గురించి వదిలేయండి, అని మరో నెటిజన్ సలహా ఇచ్చారు.

  కవలల తల్లి

  కవలల తల్లి

  మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే కాశ్మీరా రాయాన్, క్రిషాంగ్ అనే కవలల తల్లి. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో ఎల్లప్పుడూ బాడీ ఫిట్ గా ఉంచే ఈ నటి బరువు పెరిగింది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, నేను చాలా బరువు పెరిగాను. అప్పుడు మేము ఐవిఎఫ్ ఆప్షన్ ఎంచుకున్నప్పుడు, పిల్లలు కడుపులో పడ్డారని చెప్పుకొచ్చింది.

  Happy Birthday Maniratnam : Maniratnam Biggest Multistarer Plan Got Shelved

  ఇప్పుడు అదే పని


  ఆ సమయంలో శరీరం పూర్తిగా అదుపు తప్పి బరువు పెరిగానని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే తాను అద్దంలో సైతం నన్ను నేను చూసుకోవడం మానేశానని చెప్పుకొచ్చింది. మూడు సంవత్సరాల క్రితం పిల్లలు పుట్టారన్న ఆమె ఆ తరువాత నేను నా బిడ్డగా భావించే సినిమా కోసం పనిచేయడం ప్రారంభించానని అన్నారు. ఈ సినిమాకి తానే దర్శకత్వం వహిస్తున్నాను, కాబట్టి దృష్టి మొత్తం సినిమాపైనే ఉందని పేర్కొంది.

  English summary
  'Bigg Boss' fame Kashmera Shah was trolled online some days back. Now she gave it back to her 'critics' with her latest Instagram photo. In response to her haters she wrote ''I have enough critics already. But the loudest voice I hear is my own. I am my own cheerleader. So go ahead and have a field day trolling. After all you also need something to do with your life my dear haters''
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X