For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అమీర్ ఖాన్ సిబ్బందికి కరోనావైరస్.. నా తల్లికి అలా జరుగొద్దని ప్రార్థించండి అంటూ..

  |

  దేశ వాణిజ్య రాజధాని ముంబై మహా నగరాన్ని కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. సాధారణ ప్రజలతోపాటు ప్రముఖుల కుటుంబాలు కూడా కొవిడ్ 19న బారిన పడుతున్నాయి. బోని కపూర్, తదితర ఫ్యామిలీల తర్వాత తాజాగా బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్‌‌కు కూడా కరోనా షాకిచ్చింది. తన కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి కరోనావైరస్ సోకిందని అమీర్ ఖాన్ తాజాగా తన ట్విట్టర్‌లో ఓ లేఖను పెట్టారు. ఆ లేఖలో ఆయన చెప్పిన విషయాలు ఏమిటంటే..

   నా సిబ్బందికి పాజిటివ్

  నా సిబ్బందికి పాజిటివ్

  అమీర్ ఖాన్ ట్వీట్ చేసి.. అభిమానులు, శ్రేయోభిలాషులకు ఓ సంఘటనను షేర్ చేసుకోవాలనుకొంటున్నాను. నా స్టాఫ్‌లో కొంతమందికి కరోనావైరస్ పాజిటివ్‌ అని తేలింది. వారందరిని క్వారంటైన్‌లో పెట్టాం. సకాలంలో బొంబాయి మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు స్పందించి వైద్య సదుపాయాలను అందజేస్తున్నారు. శానిటైజేషన్, ఇతర కార్యక్రమాలను చేపట్టిన బీఎంసీ అధికారులకు నా ధన్యవాదాలు అంటూ అమీర్ ఖాన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

  నా కుటుంబంలో అందరికీ నెగిటివ్

  నా కుటుంబంలో అందరికీ నెగిటివ్

  నా కుటుంబంలో, సిబ్బందిలో చాలా మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా తల్లికి కరోనావైరస్ పరీక్షలు జరిపించాం. టెస్టుల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్నాం. మా సిబ్బంది, ఫ్యామిలీలోనే మా అమ్మనే చివరగా మిగిలింది. నా తల్లికి కూడా నెగిటివ్ రావాలని అందరూ ప్రార్థించండి అంటూ అమీర్ ఖాన్ తన అభిమానులను, సన్నిహితులు, స్నేహితులను కోరారు.

  బీఎంసీ సేవలు అద్బుతం

  బీఎంసీ సేవలు అద్బుతం

  కోవిడ్ పరిస్థితులకు, ఆ వ్యాధి బారిన పడిన వ్యక్తులకు సహాయం అందించడంలోనూ, అలాగే వైద్య సదుపాయాలు కల్పించడంలో బీఎంసీ చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. ప్రతీ అధికారి తమ విధులకు కట్టుబడి ప్రొఫెషనల్‌గా స్పందిస్తున్న తీరును చూసి నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను అని అమీర్ ఖాన్ అన్నారు.

  కోకిలాబెన్ వైద్యుల సేవలు అమోఘం

  కోకిలాబెన్ వైద్యుల సేవలు అమోఘం

  అలాగే ముంబై, మహారాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై కొకిలాబెన్ హాస్పిటల్ సిబ్బంది, వైద్యులు, నర్సులు అందిస్తున్న సేవలు అభినందనీయం. కరోనా పరీక్షలను వారు ఎంతో ఓర్పు, సహనంతో చేస్తున్నారు. రోగులపట్ల వారు చూపిస్తున్న దయ, కరుణ నన్ను ఎంతగానో ఆకట్టుకొన్నది. వారందరినీ భగవంతుడు చల్లగా చూడాలి అని అమీర్ ఖాన్ ఆకాంక్షించారు.

  Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
   లాల్ సింగ్ చద్దా షూటింగ్

  లాల్ సింగ్ చద్దా షూటింగ్

  ఇక అమీర్ ఖాన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ఆధారంగా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. జూలై 15వ తేదీ నుంచి షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తన సిబ్బంది కరోనావైరస్ బారిన పడటంతో కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఈ చిత్రంలో కరీనా కపూర్ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

  English summary
  Bollywood actor Aamir Khan shared a news that his staff tested coronavirus positve. Aamir said, Hello everyone, this is to inform you that some of my staff have tested positive. They were immediately quarantined, and BMC officials were very prompt and efficient in taking them to a medical facility.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X