Just In
Don't Miss!
- News
ప్రశ్నిస్తే ప్రాణం తీస్తారా? ఆ ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు పెట్టాలి: పవన్ కళ్యాణ్ ఫైర్, అక్రమ అరెస్టులా?
- Sports
సుందర్ సెంచరీ చేయలేదని బాధపడ్డ.. అతను మంచి బ్యాట్స్మెన్
- Automobiles
కార్ డ్రైవర్ల గురించి సంచలన నిజాలు బయటపెట్టిన సర్వే.. ఏంటి ఆ నిజాలు
- Finance
ఒక్కరోజులో రూ.2.72 లక్షల కోట్ల సంపద ఆవిరి: రెండ్రోజుల్లో భారీ పతనం
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ బాలీవుడ్ హీరో పట్టిందాల్లా బంగారమే.. అందుకే రూ.17వందల కోట్ల ఆదాయం
బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి క్లిక్కయితే చాలు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉంటాయి. అయితే ఆలోచించి నిర్ణయాలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారలు ఒక ఏడాదిలోనే ఈజీగా 100కోట్ల ఆదాయాన్ని అందుకుంటున్నాడు. ఇక బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ అయితే నెవర్ బిఫోర్ అనేలా ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.

స్పీడ్ గా సినిమాలు చేస్తూ..
అక్షయ్ కుమార్ గత కొంతకాలంగా బాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు. వీలైనంత వరకు ఏడాదిలో మినిమమ్ మూడు ప్రాజెక్టులు పడేలా చేస్తున్నాడు. అంతే కాకుండా సొంతంగా సినిమాలను నిర్మించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రతి సినిమాకు కూడా అక్షయ్ కో ప్రొడ్యూసర్ గా కూడా ఉంటున్నాడు.

సంపాదన అమాంతంగా పెరిగిపోయింది.
కేవలం రెమ్యునరేషన్ ద్వారానే కాకుండా అక్షయ్ సినిమాల కలెక్షన్స్ నుంచి ప్రాఫిట్స్ కూడా అందుకుంటున్నాడు. ఆ విధంగా చూసుకుంటే మిగతా హీరోల కంటే అక్షయ్ ప్రతి ఏడాది అత్యదిక ఆదాయాన్ని అందుకుంటున్న వారిలో మొదటి స్థానంలో నిలుస్తున్నాడు. ఇక ఈ అరేళ్లలో అతని సంపాదన అమాంతంగా పెరిగిపోయింది.

6 సంవత్సరాల ఆదాయం..
2014 నుండి 2020 వరకు అతను మునుపెన్నడు లేనంత భారీ స్థాయిలో సంపాధించాడు. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకారం, అక్షయ్ 6 సంవత్సరాల ఆదాయం 1,744 కోట్ల రూపాయలని తెలుస్తోంది. కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ అక్షయ్ హవా ఏ మాత్రం తగ్గలేదు. 2020 మొత్తం ఆదాయం $48.5 మిలియన్లని తెలుస్తోంది. మన ఇండియన్ కరెన్సీలో రూ .356.57 కోట్లు.

2015 నుంచి ఇప్పటివరకు..
ఇక అంతకుముందు 2019లో రూ. 459.22 కోట్లు సంపాదించిన అక్షయ్ 2018లో రూ. 277.06 కోట్లు అందుకున్నాడు. 2017 రూ. 231.06 కోట్లు, 2016 లో రూ. 211.58 కోట్లు. 2015 లో 208.42 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఈ విధంగా మొత్తం సంఖ్య ఈ అరేళ్లలో 1744కోట్ల రూపాయలకు వచ్చింది.

ఇంటర్నేషనల్ లెవెల్లో.. బ్రాండ్ అంబాసిడర్ గా
సినిమాల వల్లనే కాకుండా అక్షయ్ కుమార్ ఇంటర్నేషనల్ లెవెళ్లలో పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉంటున్నాడు. ఆ విధంగా కూడా అక్షయ్ భారీ ఆదాయాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఫోర్బ్స్ లిస్ట్ లో అక్షయ్ మరోసారి తన ధన బలాన్ని చూపించాడు. కేవలం సంపాదనలోనే కాకుండా అక్షయ్ పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ మంచి గుర్తింపును అందుకున్నాడు.