twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Anurag Kashyap మాటలకు వివేక్ అగ్నిహోత్రి ట్వీట్స్ వార్.. ముందు రీసెర్చ్ చేయండి అంటూ కౌంటర్

    |

    ఇటీవల కాలంలో బాలీవుడ్ దర్శకుల మధ్య కొంత మాటల యుద్ధం ఎక్కువవుతొంది. ప్రముఖ రచయిత దర్శకుడు అనురాగ్ కశ్యప్ రీసెంట్ గా సౌత్ సినిమాలు ఇండస్ట్రీని దారుణంగా నాశనం చేశాయి అని ఆయన చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసాయి. ఒక విధంగా ప్రేక్షకుల అంచనాలను కూడా కాంతార, పుష్ప సినిమాలు మార్చేశాయని ఇకనుంచి సినిమా మేకింగ్ విధానం కూడా పూర్తిగా మార్చుకోవాల్సిందే అని తరహాలో కూడా ఆయన వివరణ అయితే ఇచ్చారు. అయితే ఈ విషయంలో కొంతమంది సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

    ముఖ్యంగా ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ కూడా ఊహించని విధంగా సోషల్ మీడియా ద్వారానే ఆయనకు కౌంటర్ ఇవ్వడం వైరల్ గా మారింది. అనురాగ్ కశ్యప్.. కాంతార, పుష్ప లాంటి సినిమాలు ఇండస్ట్రీని నాశనం చేశాయి అని అన్నారు. అయితే ఆ సమాధానం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని ఇందులో నేను ఏ మాత్రం ఏకీభవించడం లేదు ఆయన కౌంటర్ ఇచ్చారు. దీంతో ఆ ట్వీట్ కు అనురాగ్ స్పందిస్తూ.. సార్ ఇది మీ తప్పు కాదు. మీ సినిమాల రీసెర్చ్ అనేది నా సంభాషణలపై మీరు చేసిన ట్వీట్ తరహాలోనే ఉంది.

    Bollywood directors Anurag kashyap and vivek agnihotri shocking tweets war

    మీ పరిస్థితి, మీ మీడియా పరిస్థితి కూడా అలాగే ఉంది. తదుపరి సారి కొంత తీవ్రమైన రీసెర్చ్ చేస్తే బాగుంటుంది అని అనురాగ్ కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు. ఇక అనురాగ్ కామెంట్ పై రియాక్ట్ అయిన వివేక్ ఈ విధంగా స్పందించారు. 'ది కాశ్మీర్ ఫైల్స్' సినిమా కోసం నాలుగు సంవత్సరాల నా రీసెర్చ్ అంతా అబద్ధమని నిరూపించండి. అలాగే గిరిజా టికూ, బికె గంజు, ఎయిర్‌ఫోర్స్ హత్య, నడిమార్గ్ - అన్నీ అబద్ధాలేదనా.. 700 మంది పండితుల వీడియోలన్నీ అబద్ధాలేనా.. హిందువులు ఎవరూ చనిపోలేదా? అంటూ.. దీన్ని నిరూపించండి, తద్వారా నేను మరోసారి తప్పు చేయను.. అని అగ్నిహోత్రి అనురాగ్ కు కౌంటర్ గా మరో ట్వీట్ లో అన్నారు.

    English summary
    Bollywood directors Anurag kashyap and vivek agnihotri shocking tweets war
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X