twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ సైతం ఓటీటీ వైపే.. ఆ చిత్రాలకు అంత రేటు ఇస్తారా?

    |

    కరోనా వైరస్ ప్రపంచగతినే మారుస్తోంది. మానవాళి జీవితంలోకి చొచ్చుకు వచ్చిన ఈ వైరస్ ఎన్నో మార్పులను తీసుకొచ్చేలా కనిపిస్తోంది. మానవ జీవన విధానంలో పెను మార్పులు కనిపించబోతోన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమలో కరోనా పెద్ద మార్పులను తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఇకపై మునుపటిలా వ్యవహారం ఉండకపోవచ్చు. థియేటర్లలో సందడి కనిపించకపోవచ్చు. కరోనా భయంతో ఎవ్వరూ థియేటర్స్ జోలికి పోకుండా ఉండే అవకాశం కనిపిస్తోంది.

    అందుకే ఇప్పటికే చాలా మంది నిర్మాతలు ఓటీటీ వైపు చూస్తున్నారు. చిన్న నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తైన చిత్రాలు.. రిలీజ్‌కు నోచుకోకుండా మూలన పడి ఉన్నాయి. కరోనా దెబ్బకు గత రెండు నెలలుగా థియేటర్లు మూతపడ్డాయి. షూటింగ్స్ క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని చిత్రాలు మధ్యలోనే ఆగిపోయాయి. పూర్తైన చిత్రాలకూ మోక్షం దక్కడం లేదు. అందుకే కొందరు నిర్మాతలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించి కొంత నష్టాన్ని అయినా పూడ్చుకుందామని ప్రయత్నిస్తున్నారు.

     Bollywood Movies Choosing OTT platform Than Theatres

    ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్ ఈ దిశగా అడుగులు వేశాయి. ఇక బాలీవుడ్‌లోని కొన్నిచిత్రాలు ఓటీటీపై వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. ఈ జాబితాలో గులాబో సితాబో, లక్ష్మీ బాంబ్, శకుంతలా దేవీ హ్యూమన్ కంప్యూటర్, దుర్గావతి, గుంజన్ సక్సేనా, జుంధ్, చెహ్రే, లూడో వంటి చిన్న చిత్రాలు అమెజాన్, హాట్ స్టార్ వంటి వాటిలో వచ్చేందుకు రెడీగా ఉన్నాయి. వీటన్నంటిలో అక్షయ్ కుమార్‌కు వంద కోట్లు చెల్లించిందట. అయితే సూర్యవంశీ, 83 వంటి భారీ బడ్జెట్ చిత్రాల సంగతే అగమ్యగోచరంగా మారింది. దాదాపు 200-400 కోట్లు వసూల్ చేసే సత్తాగల ఆ చిత్రాలు థియేటర్లో రిలీజ్ చేస్తేనే లాభం ఉంటుంది. మరి ఇలాంటి చిత్రాలకు మోక్షమెప్పుడు కలుగుతుందో చూడాలి.

    English summary
    Bollywood Movies Choosing OTT platform Than Theatres. The covid-19 pandemic has had what could be a trend-setting impact on the Indian film industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X