twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐపీఎల్ లో జట్టు కోసం పోటీ పడుతున్న బాలీవుడ్ స్టార్ కపుల్స్.. భారీగా పెట్టుబడులు!

    |

    బాలీవుడ్ సినిమా ప్రపంచంలో క్రికెట్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెప్పవచ్చు. సాధారణంగా వెండితెర సెలబ్రిటీలకు అలాగే క్రికెటర్లకు కూడా ఒక తెలియని అనుబంధం ఉంటుంది. ఎలాంటి ఇంటర్నేషనల్ ఫిల్మ్ వేడుకలు జరిగిన కూడా క్రికెటర్స్ తో పాటు బాలీవుడ్ తారలు కూడా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తూ ఉంటారు. ఐపీఎల్ స్టార్ట్ అయింది అంటే సినీ తారలు కూడా ఏదో ఒక విధంగా ఆ హడావిడిలో పాల్గొంటాటు. ఇప్పటికే ఐపీఎల్ లో కొంతమంది ప్రత్యేకంగా సొంత జట్లను కలిగి ఉన్నారు. త్వరలోనే మరో బాలీవుడ్ జంట కూడా ఐపీఎల్ లో ఒక ప్రత్యేకమైన జట్టును కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే ఇద్దరు అగ్ర తారలు

    ఇప్పటికే ఇద్దరు అగ్ర తారలు

    ప్రస్తుతం ఎనిమిది జట్లతో కొనసాగుతున్న ఐపీఎల్ తదుపరి సీజన్ కు వచ్చేసరికి మరొక రెండు చెట్లు కొత్తగా చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తం పది జట్లతో ఐపీఎల్ ఇక నుంచి సరికొత్త గా కనిపించే అవకాశం ఉందట. ఇప్పటికే షారుఖ్ ఖాన్ కోల్ కతా నైట్ రైడర్స్ అధినేతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా మరొకవైపు గ్లామరస్ హీరోయిన్ ప్రీతి జింటా కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓనర్ గా కొనసాగుతోంది.

    మళ్ళీ ఆ టీమ్స్ సరికొత్తగా..

    మళ్ళీ ఆ టీమ్స్ సరికొత్తగా..

    గతంలో రాజస్థాన్ రాయల్స్ తరపున శిల్పా శెట్టి యాజమాన్యం లో కీలక సభ్యురాలిగా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే వారిపై బెట్టింగ్ ఆరోపణలు వచ్చిన తర్వాత ఆమె మెల్లగా ఆ జట్టుకు దూరం అయ్యింది. ఇక ఇప్పుడు మళ్లీ మరొక రెండు జట్లు ఐపీఎల్ లో జత కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పూణే, గుజరాత్ భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే మళ్ళీ ఎందుకో ఆ జట్లను మళ్ళీ తీసేశారు ఇక ఇప్పుడు మళ్లీ కొత్తగా మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    రంగంలోకి బాలీవుడ్ స్టార్స్

    రంగంలోకి బాలీవుడ్ స్టార్స్

    బాలీవుడ్ స్టార్ కపుల్స్ దీపికా పదుకొనే రణవీర్ సింగ్ క్రికెట్ అతను ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఇద్దరు కపుల్స్ చాలాసార్లు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లు ఎక్కడ ఆడిన కూడా భారత్ తరఫున ప్రత్యేకంగా మద్దతు పలుకుతూ ఉంటారు. ఇక ఈసారి ఏకంగా వారు ఇద్దరూ కలిసి ఒక ప్రత్యేకమైన జట్టును కొనుగోలు చేసే అవకాశం ఉందట. అందుకోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. 10 సంవత్సరాల లైసెన్స్ కోసం ప్రతి జట్టుకు $ 375 నుండి $ 425 మిలియన్ల మధ్య బిడ్‌లు వేసుకోవచ్చు.

    పోటీ పడుతున్న దీపికా, రణ్ వీర్

    పోటీ పడుతున్న దీపికా, రణ్ వీర్

    త్వరలో ఐపీఎల్ లో మరొక రెండు జట్లను కలపబోతున్నారని బీసీసీఐ ప్రకటించగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని బడా కంపెనీ లో రెండు జట్లను కొనుగోలు చేసేందుకు బిడ్స్ వేస్తున్నాయి. ఇక ఆ పోటీలో దీపిక పదుకొనే రణవీర్ సింగ్ కూడా పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయంలో ఇంకా అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జట్టు సొంతం అయితే మరొకసారి ప్లేయర్లను వేలం వేయనున్నారు. మరి దీపిక పదుకొనే రణవీర్ సింగ్ ఇద్దరూ కూడా ఏలాంటి ప్లేయర్లను సొంతం చేసుకుంటారో చూడాలి.

    English summary
    Bollywood stars Ranveer Singh & Deepika in race for IPL team
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X