twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Shah Rukh Khan : మొట్టమొదట కోతి వేషం..50 రూపాయల సంపాదన నుంచి కింగ్ రేంజ్ కి!

    |

    ఈ రోజు బాలీవుడ్ కింగ్ ఖాన్, షారుక్ ఖాన్ పుట్టిన రోజు. ఇవాళ ఆయన 56వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. షారుఖ్ 1965 నవంబర్ 2న న్యూఢిల్లీలో జన్మించారు. ఇక కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కారణంగా ఇన్నాళ్లు నిద్ర లేని రాత్రులు గడిపిన ఆయన ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. ఇక ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని సంగతులు తెలుసుకుందాం.

    అక్కడ చదివి

    అక్కడ చదివి

    షారుఖ్ తండ్రి పేరు తాజ్ మహమ్మద్ ఖాన్, ఒక స్వాతంత్ర్య సమరయోధులు, తల్లి పేరు ఫాతిమా. అయితే, ఆయనకు షహనాజ్ లాల్ రూఖ్ అనే పెద్ద సోదరి కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. ఆమె కూడా ముంబైలో షారుఖ్ తో కలిసి నివసిస్తుంది. షారుక్ ఖాన్ ఢిల్లీలో సెయింట్ కొలంబస్ స్కూల్ లో చదువుకున్నాడు. చదువుకున్నప్పుడే హాకీ, ఫుట్ బాల్, క్రికెట్ వంటి ఛాంపియన్ ప్లేయర్ గా కూడా రాణించాడు. షారుక్ కు చిన్నప్పటి నుంచి నటన అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో రాంలీలాలో కోతి పాత్ర పోషించేవాడు. చదువు పూర్తయిన తర్వాత షారుఖ్ ఢిల్లీలో థియేటర్ యాక్షన్ గ్రూప్ లో ప్రఖ్యాత థియేటర్ డైరెక్టర్ బారీ జాన్ నుంచి నటనా విద్య అభ్యసించారు కెరీర్ ప్రారంభానికి ముందు షారుఖ్ ఢిల్లీ దర్యాగంజ్ లో ఓ రెస్టారెంట్ నడిపేవాడు. అప్పట్లో షారుక్ తొలి సంపాదన కేవలం 50 రూపాయలు మాత్రమే. కానీ ఇప్పుడు ఆయన పేరు చెప్తే వందల కోట్లు బిజెస్ జరుగుతుంది.

     'స్వోర్డ్‌ ఆఫ్‌ హానర్‌'

    'స్వోర్డ్‌ ఆఫ్‌ హానర్‌'

    కెరీర్‌ ప్రారంభ రోజులో విలన్‌ పాత్రల్లో నటించి బాలీవుడ్‌ కింగ్‌ ఆఫ్‌ రొమాన్స్‌గా ఎదిగారు. ప్రపంచ సక్సెస్‌ఫుల్‌ సెలబ్రిటీల్లో ఒకరిగా నిలిచిన షారుక్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ శుభాకాంక్షలు చేబుతున్నారు. ఇక చిన్నప్పటి నుంచి చదువులో, క్రీడల్లో ఎప్పుడూ ముందుండే ఆయన చదివిన సెయింట్‌ కొలంబియా స్కూల్‌ నుంచి 'స్వోర్డ్‌ ఆఫ్‌ హానర్‌' అవార్డును కూడా అందుకొన్నారు. కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవారు. హన్స్‌రాజ్‌ కాలేజ్‌ చదివేటప్పుడు కాలేజ్‌కి వెళ్లడం కంటే దిల్లీలోని టీఏజీ(థియేటర్‌ యాక్షన్‌ గ్రూప్‌)లోనే ఎక్కువగా గడిపేవారు. అక్కడి నుంచే భారీ జాన్‌ అనే థియేటర్‌ డైరెక్టర్‌ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నారు.

    20 ఏళ్ల పాటు

    20 ఏళ్ల పాటు

    1981లో షారుక్‌ తండ్రి మీర్‌ తాజ్‌ మహ్మద్‌ ఖాన్‌ క్యాన్సర్‌తో చనిపోగా 1991లో తల్లి లతీఫ్‌ఫాతిమా మధుమేహంతో తుదిశ్వాస విడిచారు. ఆ బాధతో షారుక్‌ సోదరి షెహనాజ్‌ మంచానపడ్డారు. దాంతో ఓ పక్క నటనలో శిక్షణ తీసుకుంటూనే సోదరిని చూసుకునేవారు. అప్పటివరకు బుల్లితెరపై నటిస్తూ వచ్చిన షారుక్‌ 1992లో 'దీవానా' చిత్రంలో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేశారు. అలా తొలినాళ్లలో షారుక్‌ విలన్‌ పాత్రల్లోనే ఎక్కువగా నటిస్తూ ఉండేవారు. అలా వచ్చిన సినిమాలే 'డర్‌', 'బాజిగర్‌', 'అంజామ్‌' చిత్రాలు చేశారు. షారుక్‌ 1995లో పూర్తి తరహా హీరో పాత్రలో నటించిన చిత్రం 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయేంగే'తో షారుక్‌ పాపులారిటీ ఓ రేంజ్‌లో పెరిగిపోయింది. ఈ సినిమా 20 ఏళ్ల పాటు ముంబయిలోని మరాఠా మందిర్‌ థియేటర్‌లో ఆడింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

    పిరమిడ్‌ కాన్‌మార్ని అవార్డు

    పిరమిడ్‌ కాన్‌మార్ని అవార్డు

    తొలి కమర్షియల్‌ హిట్‌గా నిలిచిన 'దిల్‌వాలే...' తర్వాత షారుక్‌ 'దేవ్‌దాస్‌'లో ప్రేమికుడిగా, 'స్వదేశ్‌'లో నాసా శాస్త్రవేత్తగా, 'చక్‌ దే ఇండియా'లో హాకీ కోచ్‌గా, 'మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌'లో మానసిక వికలాంగుడిగా కూడా నటించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. షారుక్‌కి 'రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' పేరిట సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఐపీఎల్‌ జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కి షారుక్‌ సహ యజమానిగా వ్యవహరిస్తూ ఉంటారు. పిల్లల చదువు కోసం షారుక్‌ చేసిన సాయానికి 2011లో యునెస్కో పిరమిడ్‌ కాన్‌మార్ని అవార్డు అందుకొన్నారు. ఇక ముస్లిం అయిన షారుక్‌.. పంజాబ్‌కి చెందిన హిందువు గౌరీ చిబ్బర్‌ను 1991లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తాను ముస్లిం అయినా గౌరీని హిందువుల సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికి ముగ్గురు పిల్లలు వారే ఆర్యన్‌ ఖాన్‌, సుహానా ఖాన్‌, అబ్రామ్‌ ఖాన్‌.

    Recommended Video

    Vishal చర్య ప్రతీ Star Hero కి పాఠం.. ఇదీ కదా హీరోయిజం అంటే || Filmibeat Telugu
    ఈసారి ఇంటికి రావద్దని

    ఈసారి ఇంటికి రావద్దని

    షారుక్‌ కెరీర్‌ లో 226 అవార్డులకు నామినేట్‌ కాగా అందులో 207 అవార్డులు సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇక ముంబయిలోని జుహులో షారుక్‌ నివాసం 'మన్నత్‌' చాలా పాపులర్‌. ఆయనకు ఓ ప్రార్థన గది కావాలన్న ఒక్క కారణంతో ఈ మన్నత్‌ ఇంటిని రూపొందించుకున్నారట. ఇప్పటికీ తాను ఆర్థికంగా కష్టాల్లో ఉంటే దేన్నైనా అమ్ముతాను కానీ ఇంటిని మాత్రం అమ్మను అంటుంటారు. ఇక ఈసారి తన పుట్టినరోజును కేవలం కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని షారుక్‌ ఖాన్‌ నిర్ణయించుకోవడంతో సెలబ్రిటీలు ఎవరూ ఇప్పుడప్పుడే ఇంటికి రావొద్దని, ఆర్యన్‌ కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని షారుక్ చెప్పినట్లు సమాచారం. 26 రోజుల పాటు జైల్లో గడిపి వచ్చిన ఆర్యన్ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నారు. ఇక ప్రస్తుతం షారుఖ్ మూడు సినిమాల్లో నటిస్తునారు. పఠాన్, లయన్ సినిమాల్లో నటిస్తూ ఉండగా మరో పక్క అట్లీతో మరో సినిమా చేస్తున్నారు.

    English summary
    Shah Rukh Khan is celebrating his 56th birthday, here are some details of him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X