Just In
Don't Miss!
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Sports
ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన అజహరుద్దీన్ కలల లిస్టు ఇదే.. ఐపీఎల్, 4 సెంచరీలు సహా!!
- News
చర్చలు 120 శాతం ఫెయిల్.. 'ఉపా' చట్టాన్ని ప్రయోగిస్తారా? బ్రోకర్లతో చర్చలకు వెళ్లం.. రైతుల సంఘాల ఫైర్...
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వావ్.. తెరపైకి మరోసారి వార్ కాంబినేషన్
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్య మల్టీస్టారర్ సినిమాలు గతంలో మాదిరిగా అయితే రావడం లేదనేది వాస్తవం. సరైన కథ కుదరకపోవడం వల్లనో లేక హీరోల మధ్యన ఉన్న విబేధాల వలనో తెలియదు గాని అగ్ర హీరోలు మాత్రం చాలా వరకు వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తగ్గించేశారు. చాలా రోజుల తరువాత వార్ సినిమా ద్వారా ఒక టైప్ ఆఫ్ మల్టీస్టారర్. ప్రాజెక్టు ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసింది.
గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన వార్ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్ - టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ఆ సినిమా నిర్మాతలకు మంచి లాభాలను అందించింది. అసలు మ్యాటర్ లోకి వార్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ హృతిక్ రోషన్ తో మరో యాక్షన్ సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టైగర్ ష్రాఫ్ ని మళ్ళీ తీసుకుంటారో లేదో తెలియదు గాని తప్పకుండా మరొక హీరో మాత్రం హృతిక్ తో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటాడని టాక్ వస్తోంది.

మల్టీస్టారర్ సినిమా అయితేనే వార్ అంచనాలను అందుకోగలమని దర్శకుడు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా తరహాలో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక వార్ సినిమాను తెలుగులో కూడా భారీగానే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హృతిక్ రోషన్ కూడా టాలీవుడ్ మార్కెట్ పై కూడా ఎప్పటి నుంచో పట్టు సాధించాలని అనుకుంటున్నాడు. ఆ కోరిక వార్ ద్వారా సక్సెస్ అయ్యింది. మరి సెకండ్ టైమ్ ఈ కాంబినేషన్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.