twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోనీ కపూర్ కి కేటుగాళ్ల టోపీ.. ఏమీ అర్ధం కాకుండానే కొట్టేశారట!

    |

    బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, నటుడు అనిల్ కపూర్ సోదరుడు, దివంగత శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను సైబర్ కేటుగాళ్ళు మోసగించిన కేసు వెలుగులోకి వచ్చింది. బోనీకపూర్ బ్యాంకు ఖాతా నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు చోరీకి గురైనట్లు సమాచారం. ఈ నేరం గురించి బోనీ కపూర్ పోలీసులకు సమాచారం అందించగా, ముంబై పోలీసులు సమాచార సాంకేతిక చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదు చేశారు. బుధవారం ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్‌లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదైంది. బోనీ కపూర్ చెబుతున్న దాని ప్రకారం, ఆయన క్రెడిట్ కార్డ్‌తో ఒకరు ఐదు లావాదేవీలు చేసి, ఖాతా నుండి రూ. 3.82 లక్షలు విత్‌డ్రా చేశారు.

    తన నుంచి ఎలాంటి క్రెడిట్ కార్డ్ సమాచారం అడగలేదని బోనీ పేర్కొన్నారు. ఈ విషయం మీద ఆయనకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదని, అయితే తన ఖాతా నుంచి డబ్బులు డ్రా అయినట్లు బ్యాంక్ కు వెళ్ళాక తెలిసిందని బోనీ చెప్పారు. అనంతరం బ్యాంకుతో మాట్లాడి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. బోనీ కపూర్ కార్డును ఉపయోగించి డేటాను ఎవరో దొంగిలించినట్టు తాము అనుమానిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. విచారణలో, బోనీ కపూర్ ఖాతా నుండి డబ్బు గురుగ్రామ్‌లోని ఒక కంపెనీ ఖాతాకు వెళ్లినట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ విషయంపై విచారణ ఇంకా కొనసాగుతోంది.

    Boney Kapoor Falls Prey To Cyber Crime

    ఇక బోనీ కపూర్ ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత. మిస్టర్ ఇండియా, నో ఎంట్రీ, జుదాయి, వాంటెడ్ సహా మామ్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. ఇక ఈ మధ్య ఆయన తెలుగులో బోనీ కపూర్ వకీల్ సాబ్ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. బోనీ త్వరలో లవ్ రంజన్ దర్శకత్వంలో కొత్త చిత్రంలో నటించనున్నారు. రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రంలో ఆయన రణబీర్ కపూర్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడు. బోనీకి నటుడిగా ఇదే తొలి చిత్రం. ఈ సినిమాలో వీరితో పాటు శ్రద్ధా కపూర్ కూడా కనిపించబోతోంది. బోనీ కపూర్ దివంగత నటి శ్రీదేవి భర్త, జాన్వీ కపూర్, ఖుషి కపూర్ లకు తండ్రి. అలాగే నటులు అర్జున్ కపూర్, అన్షులా కపూర్ కూడా బోనీ కపూర్ పిల్లలే. అర్జున్ బోనీ మొదటి భార్య మోనా కపూర్ కొడుకు. మరోవైపు, అనిల్ కపూర్ అలాగే సంజయ్ కపూర్ బోనీ సోదరులు.

    English summary
    Boney Kapoor Falls Prey to Cyber Crime and Duped Around Rs 4 lakhs.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X