For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రకుల్ ప్రీత్‌కు షాక్... హాట్ సినిమాకు ముఖం చాటేసిన బయర్లు?.. గందరగోళంలో నిర్మాత.. కారణం ఏమిటంటే

  |

  దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు హీరో అజయ్ దేవగన్‌తో జతకట్టింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్లు, వీడియో సాంగ్స్ రిలీజై సినీ అభిమానులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ సినిమాలోని అజయ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయర్లు వెనుకాడటంపై బాలీవుడ్‌లో భారీ చర్చ జరుగుతున్నది. అందుకు కారణం ఏమిటంటే..

  రొమాంటిక్ కామెడీ చిత్రంగా

  రొమాంటిక్ కామెడీ చిత్రంగా

  బాలీవుడ్‌లో గతంలో నటించిన రెండు చిత్రాలు నిరాశ పరచడంతో ఈ సారి రకుల్ గట్టి ప్రయత్నంతో ముందుకొచ్చింది. దే దే ప్యార్ దే చిత్రంతో హాట్ హాట్ సన్నివేశాలతో రెచ్చిపోయింది. ఈ చిత్రంలో 50 సంవత్సరాల అంకుల్ అజయ్ దేవగన్‌కు ప్రియురాలిగా నటించడం గమనార్హం. దే దే ప్యార్ దే ట్రైలర్‌లో మరో సన్నివేశంలో ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా అంటూ రకుల్ వయ్యారంగా అడిగే తీరు ఈ సినిమాలో రొమాంటిక్ రేంజ్‌ను చెప్పకనే చెప్పింది.

  రకుల్, అజయ్ కెమిస్ట్రీ హాట్ టాపిక్

  రకుల్, అజయ్ కెమిస్ట్రీ హాట్ టాపిక్

  తాజాగా విడుదల చేసిన తూ మిలా తో హైనా అనే పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. తూ మిలా తో హైనా అనే పాటను అమాల్ మాలిక్ కంపోజ్ చేయగా సింగర్ అర్జిత్ సింగ్ పాడారు. ఈ పాటలో అజయ్ దేవగన్, రకుల్ ప్రతీ సింగ్ మధ్య రొమాన్స్ తారాస్ఠాయికి చేరుకొందని చెప్పవచ్చు. ఇటీవల బాలీవుడ్‌లో గానీ.. ఇతర భాషల్లో ఇంత ఘాటుగా ఉన్న పాటను చూడలేదనే మాట వినిపిస్తున్నది.

  రకుల్‌కు అలోక్ నాథ్ ముప్పు

  రకుల్‌కు అలోక్ నాథ్ ముప్పు

  ఇలా రకుల్‌కు అన్ని అంశాలు కలిసి వస్తున్న సమయంలో పెద్ద చిక్కు ముందు పడింది. ఈ సినిమాలో మీ టూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాథ్‌ నటించడం వివాదంగా మారింది. ఇప్పటికే అలోక్ నాథ్‌ను సినిమాలోకి తీసుకోవడంపై కొందరు బాహాటంగానే మండిపడ్డారు. అయితే మీ టూ కంటే ముందుగా అలోక్ నాథ్‌ను తీసుకోవడం జరిగిందనే వాదనను చిత్ర యూనిట్ వినిపించింది.

  మీటూ భయంతో బయర్లు వెనుకంజ

  మీటూ భయంతో బయర్లు వెనుకంజ

  అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాథ్‌ను బూచీగా చూపి దే దే ప్యార్ దే, మై భీ అనే చిత్రాలను కొనడానికి బయ్యర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారట. అలోక్ నాథ్ కారణంగా మై భీ నిర్మాత ఇమ్రాన్ ఖాన్ భారీ మూల్యమే చెల్లించుకొనే పరిస్థితి ఏర్పడుతున్నదనే మాట వినిపిస్తున్నది.

  మై భీ సినిమా నిర్మాత ఆవేదనలో..

  మై భీ సినిమా నిర్మాత ఆవేదనలో..

  మై భీ సినిమా నిర్మాత పరిస్థితి ప్రస్తుతం అగమ్య గోచరంగా ఉంది. అలోక్ నాథ్‌పై ఆరోపణలు రావడానికి ఏడాదికి ముందే ఈ సినిమా పూర్తయింది. ఆ తర్వాత రేప్ ఆరోపణలు అలోక్‌పై రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నా సినిమాకు, అతడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధం లేదని నిర్మాత ఇమ్రాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సినిమా ప్రభావం దే దే ప్యార్ దేపై కూడా పడే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

  English summary
  Bollywood's upcoming movie "De De Pyaar De".The movie De De Pyaar De is the joyous rom-com for all ages. The film is Directed by Akiv Ali and produced by Bhushan Kumar, Krishan Kumar, Luv Ranjan and Ankur Garg.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X