twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తి మెడకు సీబీఐ ఉచ్చు.. సుశాంత్ కేసులో FIR, తల్లి, తండ్రి, సోదరుడిపై కూడా

    |

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియాన్ మరణం కేసులో గత రెండు రోజులుగా ఊహించని సంఘటనలు చోటుచేసుకొన్నాయి. ఈ కేసులో రంగంలోకి దిగిన సీబీఐ గురువారం సాయంత్రం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. సీబీఐ దాఖలు చేసిన ాఎఫ్ఐఆర్‌లో రియా చక్రవర్తి పేరుతోపాటు ఆరుగురు పేర్లను చేర్చారు. రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తల్లి సంధ్యా చక్రవర్తి, తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి, మేనేజర్ శ్యామ్యూల్ మిరాండా, మరో మేనేజర్ శృతి మోదీ పేర్లను ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

    Recommended Video

    Sushant Singh Rajput : రియా చక్రవర్తి సహా ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన CBI || Oneindia Telugu
    పలు సెక్షన్లతో ఎఫ్ఐఆర్

    పలు సెక్షన్లతో ఎఫ్ఐఆర్


    సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారు, నేరపూరిత కుట్ర, చీటింగ్, ఇతర కుట్ర ఆరోపణలపై ఐపీసీ కింద పలు సెక్షన్లను నమోదు చేసినట్టు ప్రాథమిక సమాచారం. బీహార్ ప్రభుత్వం కోరిక మేరకు ఈ కేసును నమోదు చేశామని సీబీఐ అధికార ప్రతినిధి వెల్లడించారు. బీహార్ పోలీసుల నుంచి కేసు దర్యాప్తును తీసుకోవడానికి కేంద్ర త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసింది.

    కీలక కేసులను దర్యాప్తు చేసిన

    కీలక కేసులను దర్యాప్తు చేసిన

    గతంలో ఆగస్టా వెస్ట్‌లాండ్ వీవీఐపీ చాపర్ డీల్, మద్యం వ్యాపారి విజయ్ మాల్యా బ్యాంక్ ఫ్రాడ్ కేసును విచారించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ (సిట్)‌కు సుశాంత్ కేసును అప్పగించినట్టు సీబీఐ వెల్లడించింది. గతంలో సంచలన కేసులను దర్యాప్తు చేసిన నూపుర్ ప్రసాద్ కేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తారు.

    మనోజ్ శ్రీధర్ నాయకత్వం

    మనోజ్ శ్రీధర్ నాయకత్వం


    సుశాంత్‌ కేసును దర్యాప్తు చేసే ాాసిట్ బృందానికి సీబీఐ జాయింట్ డైరెక్టర్ మనోజ్ శ్రీధర్ నాయకత్వం వహిస్తారు. త్వరలోనే సిట్ బృందానికి సంబంధించి వివరాలను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ నోటిఫికేషన్ జారీ చేయనున్నది అని అధికారులు వెాల్లడించారు.

    ఇప్పటికే ఈడీ రంగంలోకి

    ఇప్పటికే ఈడీ రంగంలోకి

    ఇప్పటికే ఈడీ ఈ కేసు దర్యాప్తను చేపట్టింది. తన కుమారుడు సుశాంత్ సింగ్ డబ్బును రియా చక్రవర్తి దుర్వినియోగం చేసిందని, ముంబైలో రెండు ఖరీదైన ఆస్తులను కొనుగోలు చేసి మోసాలకు పాల్పడింది అంటూ తండ్రి కేకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆమె పన్ను రికార్డులను తనిఖీ చేయగా గత కొద్ది సంవత్సరాల్లో రూ. 10 లక్షల నుంచి 14 లక్షల మేరకు వార్షిక ఆదాయం పెరిగింది. కేవలం 4 లక్షల మేరకే ఆదాయం పెరిగిన క్రమంలో ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడబెట్టారనే విషయాన్ని అధికారులకు ఆరా తీస్తున్నారు.

    English summary
    Sushant Singh Rajput Case: Sushant Singh Rajput father KK Singh alleges Rhea Chakraborty exploited financially. KK Singh has filed an FIR against Rhea Chakraborty in Rajiv Nagar Police station in Patna. In this occassion, In this occassion, ED questions Samuel Miranda, Rhea Chakraborty's Properties under scanner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X