శ్రీలీలతో ఆ స్టార్ హీరో సన్నిహితంగా.. అలా జరిగితే భార్య విడాకులు ఇస్తుందంటూ..
బాలీవుడ్‌లో డేటింగ్, అఫైర్లు, వివాహేతర సంబంధాల గురించి వార్తలు ఎక్కువగానే కనిపిస్తాయి. అయితే హిందీ యాక్టర్లపై మీడియాలో వచ్చే కథనాలు ఆసక్తికరంగా మారుతుంటాయి. అయితే తమ గురించి వచ్చే కథనాలపై విమర్శకులు చేసే కామెంట్లపై కూడా వారు పెద్దగా స్పందించకుండా ఉంటారు. అయితే తాజాగా హిందీలో సంచలనం రేపుతున్న శ్రీలీల గురించి, ఆమెతో చనువుగా ఉంటున్న రణ్‌వీర్ గురించి బాలీవుడ్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. కేఆర్కే చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
తెలుగు, కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా మారిన శ్రీలీల ప్రస్తుతం హిందీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకొంటున్నారు. ఆమె నటించిన సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే ఆమె బాలీవుడ్ మీడియాలో అత్యంత పాపులారిటీ ఉన్న సెలబ్రిటీగా మారిపోయారు. ప్రస్తుతం ఆషికి 3 చిత్రంలో నటిస్తున్న ఆమె హిందీ సినిమా పరిశ్రమలోని ఈవెంట్లలో తళతళ మెరుస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఈవెంట్‌లో రణ్‌వీర్ సింగ్‌తో కలిసి పాల్గొన్నారు.

అయితే శ్రీలీల, రణ్‌వీర్ ఇద్దరూ వేదికపై సన్నిహితంగా ఉండటంతో ఆమె గురించి రకరకాల గుసగుసలు వినిపించాయి. శ్రీలీలతో రణ్‌వీర్ చనువుగా మాట్లాడుతూ ఉండటం.. ఆమెతో సంభాషిస్తున్న సమయంలోనే ఆయన బాడీ లాంగ్వేజ్ ఓ రకంగా ఉండటం అందరూ గమనించారు. శ్రీలీలతో రణ్‌వీర్ వ్యవహరించిన తీరు గురించి క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ ఘాటుగా స్పందించడమే కాకుండా దీపికతో ఆయన మ్యారేజ్ గురించి ఆసక్తిరకమైన విషయాన్ని వెల్లడించారు.
ఎవరైనా అమ్మాయిని చూస్తే రణ్‌వీర్ వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఆయన చేష్టలు గమ్మత్తుగా ఉంటాయి. దీపిక పదుకోన్ గమనిస్తే.. ఆయనకు విడాకులు ఇవ్వడం ఖాయం. ఎందుకంటే.. దీపిక, రణ్‌వీర్ కపూర్‌ది ఓపెన్ మ్యారేజ్. అంటే.. ఎవరు ఎవరితోనైనా చనువుగా సన్నిహిత సంబంధాలు కొనసాగించవచ్చు. వేరే అమ్మాయితో రణ్ వీర్ డేటింగ్ చేయవచ్చు.. లేదా దీపిక పదుకోన్ కూడా తనకు నచ్చిన యువకుడితో క్లోజ్‌గా మూవ్ అవ్వవచ్చు. అలాంటి ఒప్పందంతో వారి వివాహం జరిగింది అని కమల్ ఆర్ ఖాన్ అన్నారు.
ఎవరైనా అమ్మాయితో రణ్‌వీర్ క్లోజ్‌గా మూవ్ అయినట్లయితే.. ఆ విషయంలో దీపిక మనస్తాపం చెందినట్లయితే.. తన భర్తకు ఆమె విడాకులు ఇవ్వవచ్చు. శ్రీలీలతో రణ్‌వీర్ వ్యవహరించే తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ విషయం దీపిక దృష్టికి వచ్చిందో లేదో అని కమల్ ఆర్ ఖాన్ తన కామెంటరీలో ఈ విషయాలను వెల్లడించారు.
దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్ రిలేషన్ విషయానికి వస్తే.. రామ్ లీలా సినిమా షూటింగ్ సమయంలో జరిగిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ చాలా సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వివాహం చేసుకొన్నారు. వారికి దువా పడుకోన్ సింగ్ అనే కూతురు ఉంది. వారిద్దరూ తమ కెరీర్‌పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే వారిద్దరూ భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


Click it and Unblock the Notifications











