twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జాతీయ ఉపాధి పథకం కూలీలుగా దీపిక, జాక్వలైన్.. ప్రతీ నెలా డబ్బు విత్‌డ్రా

    |

    బాలీవుడ్, ఇతర భాషల సినీ తారల పేర్లు రకరకాల జాబితాలో కనిపిస్తూ అందర్ని ఓ రకమైన షాక్ గురిచేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయాయి. గతంలో కొందరి తారల పేర్లు ఏదో ఒక రాష్ట్రంలో ఆధార్ కార్డులపై రావడం, ఏదో ఒక సిటీలోని కాలేజీలో సినీ తారల పేర్లు కనిపించడం తెలిసిందే. తాజాగా దీపిక పదుకోన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ పేర్లు జాతీయ ఉపాధి పథకం స్కీమ్‌లో కనిపించడం మీడియా దృష్టిని ఆకర్షించింది.

    తాజాగా మధ్య ప్రదేశ్లోని ఖార్గోనే జిల్లాలో ఓ గ్రామానికి సంబంధించిన జాతీయ ఉపాధి పథకం జాబితాలో దీపిక పదుకోన్, జాక్వలైన్ ఫెర్నాండేజ్ పేర్లు కనిపించడమే కాకుండా జూన్, జూలై మాసాలకు వారు ఆ మొత్తాలను విత్‌డ్రా కూడా చేసుకొన్నట్టు మీడియా దర్యాప్తులో వెల్లడైంది. ఇండోర్‌కు సమీపంలోని జిర్నియా పంచాయతీలోని పీపర్‌ఖేడా నాకా గ్రామంలోని 11 మంది సభ్యుల్లో వీరు కూడా ఉండటం మీడియా కంటపడింది. ఇద్దరు పురుషుల పేర్లతో మంజూరైన కార్డులపై దీపిక, జాక్వలైన్ ఫోటోలు ఉండటం కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది.

    Deepika Padukone and Jacqueline Fernandes in MGNREGA beneficiaries list

    ఇద్దరి జాబ్‌కార్డులు దీపిక పదుకోన్, జాక్వలైన్ పేర్లతో ఉన్నాయనే విషయం నా దృష్టికి వచ్చిందనే విషయాన్ని ఖార్గోనే కలెక్టర్ అనుగ్రహ పీ ధృవీకరించారు. ఈ విషయంపై అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. త్వరలోనే కఠిన చర్యలు తీసుకొంటాం అని ఆమె అన్నారు. ఉమ్రావ్, పదమ్ అనే ఇద్దరు కూలీల కార్డులపై దీపిక, జాక్వలైన్ ఫోటోలు వచ్చిన విషయం కరక్టే. వాటిపై కూడా చర్యలు తీసుకొంటాం అని అన్నారు.

    English summary
    Deepika Padukone and Jacqueline Fernandes in MGNREGA beneficiaries list in Madhya pradesh. This incident came into light in Khargone district. Khargone collector Anugraha P told media that the zilla panchayat CEO has been asked to investigate this immediately.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X