»   » సినిమాలకు దూరంగా దీపికా పదుకొన్.. ఆ హీరో కారణంగానే!

సినిమాలకు దూరంగా దీపికా పదుకొన్.. ఆ హీరో కారణంగానే!

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Deepika Padukone To Act In Vishal Bhardwaj Movie

  వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్న బాలీవుడ్ తార దీపికా పదుకోన్ వేగానికి కొంచెం కళ్లెంపడినట్టు కనిపిస్తున్నది. పద్మావతి చిత్రం తర్వాత ఏ చిత్రానికి కూడా ఒకే చెప్పకపోవడంతో బాలీవుడ్‌లో అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. రణ్‌వీర్‌తో పెళ్లి అంటూ, లేదా ఆరోగ్యం సరిగా లేకపోవడం అంటూ అనేక రకాలుగా చర్చనీయాంశమయ్యాయి. అయితే దీపికా సినిమాలు సెట్స్ పైకి వెళ్లకపోవడానికి ప్రధాన కారణాలు ఇవేనంటూ బాలీవుడ్ పత్రికలు విశ్లేషిస్తున్నాయి.

  గ్యాంగ్‌స్టర్ డ్రామా

  గ్యాంగ్‌స్టర్ డ్రామా

  పద్మావత్ చిత్రంతో దీపికా మరోసారి దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మనసును దోచుకొన్నది. ఆ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఆ తర్వాత దీపికా కొత్త ప్రాజెక్టులను అంగీకరించినట్టు వార్తలు రాలేదు. కానీ పద్మావతికి ముందే దర్శకుడు విశాల్ భరద్వాజ్ రూపొందించే గ్యాంగ్‌స్టర్ డ్రామాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

   ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం

  ఇర్ఫాన్ ఖాన్ అనారోగ్యం

  విశాల్ భరద్వాజ్ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే సమయంలోనే అనూహ్యంగా బ్రేక్ పడింది. ఈ చిత్రంలో దీపికా పక్కన నటించనున్న ఇర్ఫాన్ ఖాన్ ఆరోగ్యం విషమించడంతో గ్యాంగ్‌స్టర్ డ్రామా షూటింగ్ నిలిచిపోయింది. దాంతో రెడీగా సినిమాలు చేతిలో లేకపోవడంతో ప్రస్తుతం గోళ్లు గిల్లుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

  దీపికాకు ఆరోగ్య సమస్యలు

  దీపికాకు ఆరోగ్య సమస్యలు

  ఇదిలా ఉండగా, దీపికా పదుకొనే ఆరోగ్యంపై కూడా అనేక కథనాలు వినిపిస్తున్నాయి. ఆమె వెన్ను, మెడ నొప్పితో బాధపడుతున్నట్టు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇటీవల వెన్నునొప్పి గాయం తిరగతోడటంతో ఆమె సినిమాలకు దూరంగా ఉందనే మాట వినిపిస్తున్నది. త్వరలోనే ఈ సమస్య నుంచి బయడపడుతారు అని ఆమె సన్నిహితులు
  వెల్లడించారు.

  రెమ్యునరేషన్ షాక్

  రెమ్యునరేషన్ షాక్

  దీపికా ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తూనే మంచి పాత్రలపై దృష్టిపెట్టారట. ప్రముఖ ప్రొడక్షన్స్ వినిపించే కథలను ప్రస్తుతం వింటున్నారట. పద్మావతి తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్, కరణ్ జోహర్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్లు ఆమెతో సంప్రదింపులు జరిపాయట. అయితే పద్మావతి తర్వాత దీపికా పెంచిన రెమ్యునరేషన్ విని వారు వెనకడుగు వేసినట్టు తెలుస్తున్నది.

  English summary
  Deepika Padukone is hot property in Bollywood. Her last film, Padmaavat, crossed the Rs 500-crore mark worldwide, but she is in no hurry to sign any new projects. She was supposed to start shooting for Vishal Bhardwaj's gangster drama, but the film was put on the backburner owing to her co-star Irrfan's health woes. The actress has no other films in her kitty.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more