twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రేంజికి తగిన రెమ్యూనరేషన్ ఇవ్వాలంటున్న దీపిక పదుకోన్!

    |

    2018 డిసెంబర్లో ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ధనవంతులైన ఇండియన్ సెలబ్రిటీస్ లిస్టులో దీపిక పదుకోన్ టాప్ 5 స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. గతేడాది రూ. 112.8 కోట్ల సంపాదనతో హయ్యెస్ట్ పేయిడ్ ఉమెన్ సెలబ్రిటీగా నిలిచారు.

    ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ బెంగుళూరు బ్యూటీ... తన 12 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఉన్నత స్థానాలను అందుకుంది. పరిశ్రమలో తనకంటూ సముచిత స్థానం సంపాదించుకుంది. ఇటీవల ఓ కార్యక్రమంలో ఇండస్ట్రీలో హీరోయిన్లకు రెమ్యూనరేషన్ విషయంలో చూపుతున్న వివక్ష, అసమానతలపై స్పందించారు.

    నా ట్రాక్ రికార్డ్... నా విలువ ఏమిటో తెలుసు

    నా ట్రాక్ రికార్డ్... నా విలువ ఏమిటో తెలుసు

    నా ట్రాక్ రికార్డ్ ఏమిటో... నా విలువ ఏమిటో నాకు తెలుసు. నా కో-స్టార్స్ సినిమాలు ఎలా నడుస్తున్నాయి. నా సినిమాలు ఎలా నడుస్తున్నాయి అనే దానిపై నాకు అవగాహన ఉంది. నా స్థాయికి తగిన విధంగా రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే ఆ సినిమాలను వదులుకోవడానికి కూడా సిద్దమే అని దీపిక తెలిపారు.

    తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే ఒప్పుకోను

    తక్కువ రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తే ఒప్పుకోను

    నేను ఏ సినిమా చేసినా, అందులో ఏ హీరో నటించినా... ఎవరి స్థాయికి తగిన విధంగా వారికి రెమ్యూనరేషన్ అందాలని కోరుకుంటాను. నా స్థాయికి తగిన విధంగా రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే వాటిని వదులుకోవడానికి కూడా వెనకాడను అన్నారు.

    అసంతృప్తితో చేయను

    అసంతృప్తితో చేయను

    మనసులో అసంతృప్తి ఉంటే... రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేము. అందుకే ఈ విషయంలో ఎలాంటి స్టెప్స్ తీసుకోవడానికైనా తాను సిద్ధమే అని దీపిక స్పష్టం చేశారు.

    బ్యాడ్మింటన్ వదిలి అందుకే యాక్టింగ్ వైపు

    బ్యాడ్మింటన్ వదిలి అందుకే యాక్టింగ్ వైపు

    మా నాన్న ప్రొఫెషనల్ బ్యాడ్మింట్ ప్లేయర్ అయినప్పటికీ మీరు నటనను వృత్తిగా ఎంచుకోవడానికి కారణం ఏమిటనే ప్రశ్నకు దీపిక స్పందిస్తూ... ‘నేను కూడా మా నాన్నలాగే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ఆడటం మొదలు పెట్టాను. కానీ నేను కోరుకున్నది ఇది కాదు అని టీనేజ్‌లోనే రియలైజ్ అయ్యాను. తర్వాత మోడలింగ్, నటన వైపు ప్రయాణం మొదలు పెట్టాను' అని తెలిపారు.

    English summary
    Deepika Padukone talks about experiencing gender pay disparity in Bollywood at the launch of 'The Dot That Went For A Walk'. "I know my track record and what I'm worth. I know that my co-actor's films haven't been doing well as my films have been doing. It made absolutely no sense. I was okay to say no to that film based on that one thing as I thought it was unfair." Deepika said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X