twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లైంగిక వేధింపులు దారుణం, వారిని వదలొద్దు అంటున్న దీపిక-రణవీర్!

    |

    సెక్సువల్ హరాస్మెంట్‌కు సంబంధించి తాము ఎదుర్కొన్న అనుభవాలను #మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు నటీమణలు, వివిధ రంగాలకు చెందిన మహిళలు బయటపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పదేళ్ల క్రితం నానా పాటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన గురించి తనుశ్రీ దత్తా బయట పెట్టడం సంచలనం అయింది. ఈ ఇష్యూకు మీడియా మరింత హైప్ తేవడంతో ఎక్కడ చూసినా ఇందుకు సంబంధించిన డిబేట్లే దర్శనమిస్తున్నాయి. తాజాగా హిందుస్థాన్ టైమ్స్ నిర్వహించిన ఓ సదస్సులో జంటగా పాల్గొన్న దీపిక-రణవీర్ #మీటూ ఉద్యమంపై స్పందించారు.

    <strong>సింగర్ చిన్మయికి లైంగిక వేధింపులు... చాలా నీచంగా ప్రవర్తించారంటూ ఆవేదన! </strong>సింగర్ చిన్మయికి లైంగిక వేధింపులు... చాలా నీచంగా ప్రవర్తించారంటూ ఆవేదన!

    #మీటూ అనేది ఆడ, మగ జెండర్ పోరాటం కాదు

    #మీటూ అనేది ఆడ, మగ జెండర్ పోరాటం కాదు

    #మీటూ ఉద్యమం మగాళ్లపై ఆడవారు చేస్తున్న పోరాటమో... ఆడవాల్లపై మగాళ్లు చేస్తున్న యుద్దమో కాదని ఈ సందర్భంగా దీపిక పదుకోన్ స్పష్టం చేశారు. తమకు జరిగిన వేధింపుల అనుభవాలను ఈ ప్రపంచంతో పంచుకోవడం. ఇందులో ఆడ, మగ అనే తేడా లేదు. ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పడమే #మీటూ ఉద్యమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.

    ఎలాంటి వేధింపులైనా ఎవరూ అంగీకరించరు

    ఎలాంటి వేధింపులైనా ఎవరూ అంగీకరించరు

    నానా పాటేకర్ మీద తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణల పర్వాన్ని డైరెక్టుగా ప్రస్తావించని రణవీర్ సింగ్.... వేధింపులు ఏరకంగా ఉన్నా ఎవరూ అంగీకరించరు. పని ప్రదేశం, పబ్లిక్ ప్లేసుల్లో, వీధుల్లో, ఇంట్లో ఎక్కడైనా... ఇతరులు ఇబ్బంది పడేలా ప్రవర్తించడం వేధింపుల కిందకే వస్తాయి. ఇలాంటి సహించకూడదు. ఇందులో ఇన్వాల్వ్ అయింది ఎవరైనా ఊరికే వదలిపెట్టకూడదు అని రణవీర్ సింగ్ అభిప్రాయ పడ్డారు.

    వారిని వదలొద్దు అంటున్న దీపిక-రణవీర్

    వారిని వదలొద్దు అంటున్న దీపిక-రణవీర్

    లైంగిక వేధింపులకు గురైన, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి పేర్లు ప్రస్తావించని దీపిక-రణవీర్..... సెక్సువల్ హరాస్మెంట్ అనేది చాలా దారునం. తప్పు చేసిన ఎవరినైనా వదలొద్దు అనే విధంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    త్వరలో పెళ్లి

    త్వరలో పెళ్లి


    కాగా.... కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న దీపిక పదుకోన్-రణవీర్ సింగ్ త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు. నవంబర్లో వీరి వివాహం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    English summary
    "For me, the MeToo movement is not about gender. It's about the victory of right over wrong. So anyone who faces any sort of discrimination or any sort of abuse, I think we as a people must support that person. It's not about a woman or a man or female vs male, let's not get confused in that conversation." Deepika Padukone said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X