For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  దీపిక -రణవీర్ లేక్ కోమో వెడ్డింగ్... విమానంలో రణవీర్, ఏడ్చేసిన దీపిక (లైవ్ అప్డేట్స్)

  |
  Deepika - Ranveer Marriage : Lake Como Wedding Live Updates | Oneindia Telugu

  బాలీవుడ్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ మరికొన్ని గంటల్లో దంపతులు కాబోతున్నారు. ఇటలీలోని లేక్ కోమోలోని విల్లా దెల్ బాల్బియెనెల్లో బుధవారం వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం అయ్యాయి.

  దీపిక, రణవీర్ కుటుంబ సభ్యులు ఆదివారమే లేక్ కోమో చేరుకున్నారు. విల్లా దెల్ బాల్బియెనెల్లో సమీపంలోని ఓ లగ్జరీ రిసార్టులో వారు స్టే చేస్తున్నారు. 75 గదులు గల ఈ రిసార్టును వారం రోజుల పాటు బుక్ చేశారు. ఇందుకోసం రూ. 1.73 కోట్లు ఖర్చు పెట్టారు.

  ఇదే రిసార్టులో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు మొదలయ్యయి. రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తూ సంతోషంగా గడిపారు. మంగళవారం రాత్రి వరకు వేడుకలు జరిగాయి.

  8 వేల గులాబీలతో

  8 వేల గులాబీలతో

  బుధవారం ప్రారంభమైన పెళ్లి వేడుక కోసం విల్లా దెల్ బాల్బియెనెల్లోను వైట్ రోజెస్‌తో డెకోరేట్ చేశారు. ఇందుకోసం మొత్తం 8వేల తెల్ల గులాబీలను వాడినట్లు తెలుస్తోంది. వివాహ వేదిక ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు.

  సీ ప్లెయిన్లో రణవీర్ ఎంట్రీ

  సీ ప్లెయిన్లో రణవీర్ ఎంట్రీ

  రిసార్ట్ నుంచి వివాహ వేదిక వద్దకు రణవీర్ సింగ్ సీ ప్లెయిన్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 14 మంది కెపాసిటీ గల ఈ విమానంలో రణవీర్‌తో పాటు అతడి తల్లిదండ్రులు, మరికొందరకు కుటుంబ సభ్యులు వివాహ వేదిక వద్దకు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

  తొలి రోజు కొంకణి స్టైల్ వెడ్డింగ్

  తొలి రోజు కొంకణి స్టైల్ వెడ్డింగ్

  ముందుగా దీపిక పదుకోన్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం కొంకణి స్టైల్‌లో పెళ్లి వేడుక జరుగబోతోంది. రేపు(గురువారం) రణవీర్ సింగ్ కుటుంబ సాంప్రదాయం ప్రకారం సింధి స్టైల్ లో పెళ్లి వేడుక జరుగబోతోంది.

  కానుకలు తీసుకురావొద్దు

  కానుకలు తీసుకురావొద్దు

  పెళ్లి వచ్చే అతిథులు బహుమతులు తీసుకుని రావొద్దని.... వాటి కోసం చేసే ఖర్చును దీపిక నిర్వహిస్తున్న ‘ది లైవ్ లవ్ లాఫ్ ఫౌండేషన్'కు డొనేషన్ రూపంలో ఇవ్వాలని సూచించారట.

  దీపిక కన్నీటి బాష్పాలు

  దీపిక కన్నీటి బాష్పాలు

  మెహందీ వేడుకలో దీపిక పదుకోన్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. తన జీవితంలో అత్యంత ఆనంద క్షణాలను అనుభవిస్తున్న ఆమె సంతోషంతో కంటతడి పెట్టినట్లు సమాచారం.

  సవ్యసాచి డిజైన్స్

  సవ్యసాచి డిజైన్స్

  మెహందీ వేడుకలో రణవీర్, దీపిక ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తులు ధరించారు. పెళ్లి వేడుకలో కూడా సవ్యసాచి రూపొందించిన డిజైనర్ దుస్తువులను ఈ ప్రేమ జంట ధరించనున్నారు.

  ఏడ్చేసిన దీపిక

  ఏడ్చేసిన దీపిక

  ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎక్సేంజ్ చేసుకున్న తర్వాత దీపిక అంటే తనకు ఎంత ఇష్టమో వెల్లడిస్తూ రణవీర్ సింగ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. దీంతో దీపిక భావోద్వేగానికి గురై ఏడ్చేసినట్లు తెలుస్తోంది.

  మోకాళ్ల మీద కూర్చుని రణవీర్ రిక్వెస్ట్

  మోకాళ్ల మీద కూర్చుని రణవీర్ రిక్వెస్ట్

  ఎంగేజ్మెంట్ సెర్మనీ జరిగే సమయంలో రణవీర్ సింగ్ మోకాళ్ల మీద కూర్చుని... దీపిక చేయి పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ అడిగారట. ఈ కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రారంభం అయ్యాయి.

  వివాహం జరిగేది ఇక్కడే

  దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ వివాహం జరిగే విల్లా దెల్ బాల్బియెనెల్లో ఇదే. చుట్టూ లేక్ కోమో ప్రకృతి అందాల మధ్య ఈ విల్లా కొలువై ఉంది.

  భారీ భద్రత

  భారీ భద్రత

  పెళ్లి వేడుకకు వచ్చే వారు తప్పకుండా శుభలేఖలు తీసుకురావాలి. ఆ శుభలేఖలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసిన తర్వాతే భద్రతా సిబ్బంది లోనికి అనుమతిస్తారు.

  ఫోటోలు తీయకుండా..

  ఫోటోలు తీయకుండా..

  పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు బయటి వ్యక్తులు తీయకుండా ఏర్పాట్లు చేశారు. అతిథులు లోనికి వచ్చే ముందే సెక్యూరిటీ గార్డ్స్‌ వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ల కెమెరా లెన్స్‌కు స్టిక్కర్స్‌ అతికించిన తర్వాతే లోనికి పంపిస్తారని సమాచారం.

  సింగర్ హర్ష్‌దీప్ కౌర్

  సింగర్ హర్ష్‌దీప్ కౌర్ తన భర్తతో కలిసి లేక్ కోమో చేరుకున్నారు. దీపిక-రణవీర్ సంగీత్ వేడుకలో ఆమె పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

  English summary
  Deepika and Ranveer Lake Como Wedding Live Updates. Bollywood love burds are set to tie the knot at Lake Como in Italy on November 14.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X