Dilip Kumar ఆరోగ్యంగా ఉన్నారు.. రూమర్లను నమ్మకండి.. భార్య సైరాభాను

బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్‌ ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై ఆయన కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. దిలీప్ కుమార్ ఇక లేరంటూ వస్తున్న వార్తలను ఆయన భార్య సైరాభాను ఖండించారు. శ్వాస సంబంధిత సమస్యలతో దిలీప్ కుమార్ ఆదివారం హాస్పిటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సోషల్ మీడియాలోను, వాట్సాప్ గ్రూపుల్లోను దిలీప్ కుమార్ మరణించారనే వార్త వైరల్ అయింది. దాంతో ఆయన కుటుంబ సభ్యలు దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ప్రకటన జారీ చేశారు.

దిలీప్ కుమార్ గురించి వాట్సప్‌లో ఫార్వర్డ్ అవుతున్న మెసేజ్‌లను నమ్మకండి. దిలీప్ సాబ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన అభిమానులు, సన్నిహితులు ప్రార్థన వల్లే త్వరగా కోలుకొంటున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. అంతా దేవుడి కృపవల్లే అంటూ దిలీప్ కుమార్ అకౌంట్ ద్వారా ఆయన సన్నిహితులు తెలిపారు.

Dilip Kumar health update: Saira Bhanu condemns death rumours

సైరా భాను ఏఎన్ఐ వార్త సంస్థతో మాట్లాడుతూ.. కొద్ది రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే ముంబైలోని హిందుజా హాస్పిటల్‌లో చేర్పించాం అని తెలిపారు.

హిందూజా హాస్పిటల్‌లో చేరిన అనంతర డాక్టర్లు దిలీప్ కుమార్‌కు వివిధ రకాల పరీక్షలు చేశారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. దాంతో ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోయాయి. కానీ ఆయన ప్రాణాలకు వచ్చిన ముప్పేమీ లేదు. ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఆయనను డిశ్చార్జ్ చేస్తాం అని డాక్టర్లు పేర్కొన్నారు.

Dilip Kumar health update: Saira Bhanu condemns death rumours

దిలీప్ కుమార్ నటించిన చిత్రాలు మిలాన్, జుగ్నూ, అందాజ్, బాబుల్, నయాదౌర్, మధుమతి, కోహినూర్, మొఘల్ ఏ ఆజామ్, క్రాంతి, కర్మ, సౌదాఘర్ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.
ఆయన భారతీయ సినిమాకు సేవలందించినందుకు గాను.. 1991లో పద్మ భూషణ్, 1194లో దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు, 2015లో పద్మ విభూషన్ అవార్డుతో సత్కరించింది. పాకిస్థాన్ ప్రభుత్వం కూడా 1998లో నిషాన్ ఏ ఇంతియాజ్ అవార్డుతో సన్మానించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X