For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Raj Kundra శిల్పాశెట్టి అకౌంట్‌లో కోట్లు.. అదంతా ఆ సంపాదనే.. రంగంలోకి ఈడీ!

  |

  బాలీవుడ్‌లో రాజ్ కుంద్రాతో సంబంధమున్న పోర్న్ రాకెట్ కేసులో ఈడీ దర్యాప్తు చేసేందుకు సిద్ధమవుతున్నది. ఈ కేసు అనేక సంచలనాలకు కేంద్ర బిందువుగా మారడం, మనీలాండరింగ్ అంశాలు వెలుగు చూడటంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ) రంగంలోకి దిగతున్నట్టు వార్తలు వెలువడుతున్నది. గత రెండు రోజులుగా మహారాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ జరిపిన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..

  Jennifer Lopez birthday Photos.. ప్రియుడితో ఘాటుగా లిప్‌లాక్.. 52 ఏళ్ల వయసులో బికినీలో అందాల వడ్డిస్తున్న బ్యూటీ

  ట్విస్టులు, టర్న్‌లతో రాజ్ కుంద్రా కేసు

  ట్విస్టులు, టర్న్‌లతో రాజ్ కుంద్రా కేసు

  శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతుల పోర్న్ రాకెట్ కేసు అనేక ట్విస్టులు, టర్న్‌లతో ముందుకెళ్తున్నది. ఈ కేసులో బ్యాంక్ ట్రాన్సాక్షన్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నట్టు ముంబై మీడియా వెల్లడించింది. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కూడా అనుమానాస్పదంగా కనిపించడంతో ఈడీ రంగంలోకి దిగే అవకాశం ఉందనే వార్త మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.

  Vadinamma : శిల్ప ఇంటికి నాని ఫ్యామిలీ.. మరో స్కెచ్ వేసిన దమయంతి!

  శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా జాయింట్ అకౌంట్‌పై

  శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా జాయింట్ అకౌంట్‌పై

  హాట్ షాట్, హాట్ హిట్, బాలీఫేమ్ లాంటి యాప్‌ల ద్వారా వచ్చిన ఆదాయంపై క్రైమ్ బ్రాంచ్ అధికారులు దృష్టిపెట్టారు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాకు జాయింట్ అకౌంట్ ఉంది. ఈ యాప్‌ల ద్వారా వచ్చిన ఆదాయం ఆ జాయింట్ అకౌంట్‌లోకి వెళ్లింది అనే విషయం అధికారుల దృష్టికి వచ్చింది. ఈ జాయింగ్ అకౌంట్‌లో భారీగా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు పలు విషయాలు బయటకు వచ్చాయి.

  గ్లామరస్ ఫొటోలతో అను ఇమాన్యూయేల్ రచ్చ: గతంలో ఎన్నడూ చూడని ఫోజులతో కవ్విస్తోన్న బ్యూటీ

  ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయగా..

  ఆర్థిక లావాదేవీలపై ఆరా తీయగా..

  రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి జాయింట్ అకౌంట్‌లో కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయి. వాటి గురించి పోలీసులు ఆరా తీయగా ఇద్దరూ సమాధానం చెప్పలేదు. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఓ రాజ్ కుంద్రాకు రెండు అకౌంట్లు ఉన్నాయి. 2016 నుంచి ఆ అకౌంట్‌ను ఉపయోగించడం లేదు. కనీస బ్యాలెన్స్ కూడా అందులో పెట్టలేదు అని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు.

  భీమ్లా నాయక్‌గా పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ రానా షూట్ ఫోటో వైరల్..

  Shilpa Shetty's Home Raided By Mumbai Crime Branch | Filmibeat Telugu
  శిల్పాశెట్టి ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా

  శిల్పాశెట్టి ప్రశ్నలకు జవాబులు ఇవ్వకుండా

  జూలై 23వ తేదీన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులు శిల్పాశెట్టి ఇంటిపై దాడి చేసిన తర్యాత అనేక విషయాలు అధికారుల దృష్టికి వచ్చాయి. ఆ క్రమంలో అధికారులు ప్రశ్నించడంతో ఆమె వద్ద నుంచి సరైన వివరాలు రాలేదు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించారనే విషయం మీడియా కథనాల్లో వెల్లడైంది.

  Bigg Boss బ్యూటీ హిమజ హాట్ ఫోటోలు.. మీరెప్పుడూ చూడని గ్లామరస్ పిక్స్!

  లండన్ కేంద్రంగా.. ఈడీ ఎంట్రీ

  లండన్ కేంద్రంగా.. ఈడీ ఎంట్రీ

  రాజ్ కుంద్రా, శిల్పాశెట్టిని రానున్న రెండు రోజుల్లో ఎప్పుడైనా అంటే జూలై 26వ తారీఖు తర్వాత ఈడీ అధికారులు రంగంలోకి దిగుతారు. లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్యాలయం నుంచి భారత్‌కు ట్రాన్స్‌ఫర్ చేసిన నిధులపై ఆరా తీసే అవకాశం ఉంది అని ముంబై పోలీసులు పేర్కొంటున్నట్టు సమాచారం. మనీ లాండరింగ్, ఫారిన్ ఎక్సెంజ్ మేనేజ్‌మెంట్ (ఫెమా) చట్టం కింద దర్యాప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

  English summary
  Enforcement Directorate to investigate Raj Kundra, Shilpa Shetty case under Monye laundering and FEMA acts. At present, the ED will find out details about the claims made by Mumbai Police over Kundra’s involvement in the financial dealings of the app
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X