ఆ విషయంలో దీపిక పదుకోన్‌ను ఒప్పించలేం.. స్టార్ డైరెక్టర్ ఫైర్
తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. రెండు భాగాలుగా ఈ సినిమాను తీసుకొస్తామని దర్శక నిర్మాతలు ముందుగానే ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీపిక పదుకోన్‌ను నిర్మాతలు తప్పించడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. ఈ క్రమంలో ఆమె వ్యవహారశైలిపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు విమర్శలు వస్తున్నాయి.
కల్కి 2 నుంచి దీపిక ఔట్
కల్కికి సీక్వెల్‌గా కల్కి 2 తెరకెక్కనుండగా.. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయినట్లు వార్తలు వచ్చాయి. తొలి భాగంలో నటించిన వారే, రెండో పార్ట్‌లోనూ కొనసాగుతారని కూడా స్పష్టం చేశారు. ఇలాంటి వేళ.. హీరోయిన్ దీపిక పదుకోన్‌ను కల్కి పార్ట్ 2 నుంచి తప్పిస్తూ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది. కల్కిలో సుమతిగా, కల్కికి జన్మనివ్వబోయే మహిళ పాత్రలో దీపిక ఒదిగిపోయారు. పార్ట్ 1 క్లైమాక్స్‌లో ప్రభాస్ ఆమెను ఎత్తుకుపోవడంతో పార్ట్ 2లో ఏం జరగనుంది? అశ్వత్థామ ఆమెను రక్షిస్తాడా? ప్రభాస్‌కు గతం గుర్తొస్తుందా? అంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారు.

త్వరలో సెట్స్‌పైకి కల్కి 2
ఈ ఉత్కంఠ నేపథ్యంలో పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికల్లా కల్కి పార్ట్ 2ని సెట్స్ మీదకి తీసుకెళ్లి.. 2028 నాటికి సినిమాను రిలీజ్ చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. జాతీయంగా, అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ప్రాజెక్ట్‌లో నుంచి దీపికను వైజయంతీ మూవీస్ తప్పించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
నిబద్ధత కావాలంటూ ట్వీట్
కల్కి 2898 ఏడీ నుంచి నేటి వరకు సుదీర్ఘ ప్రయాణం కొనసాగించినప్పటికీ మా మధ్య సరైన భాగస్వామ్యం కుదరలేదని వైజయంతీ మూవీస్ ఓ ట్వీట్‌లో పేర్కొంది. ఇలాంటి భారీ చిత్రానికి నిబద్ధత అవసరమని స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన స్పిరిట్ నుంచి దీపిక తప్పుకున్నారు. ఇప్పుడు కల్కి 2898 ఏడీ నుంచి కూడా ఈ స్టార్‌ను తప్పించడం వెనుక కారణాలేంటీ? అనే దానిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
దీపిక కెరీర్‌పై దెబ్బ
భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా వెలుగొందుతున్న దీపికను వెంట వెంటనే రెండు భారీ చిత్రాల నుంచి తప్పించడం ఆమె కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే రోజుకు 8 గంటలే పనిచేస్తానని చెప్పడంతో పాటు రెమ్యునరేషన్ విషయంలో తేడాలు, తన సిబ్బందికి సకల సదుపాయాలు కల్పించాలని దీపిక పదుకోన్ పెడుతున్న షరతులే ఆమెను ఇబ్బందికి గురిచేస్తున్నాయని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు.
దీపికపై ఫరా ఖాన్ సెటైర్లు
తాజాగా బాలీవుడ్ సీనియర్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ దీపిక వ్యవహారశైలిపై సెటైర్లు వేశారు. దీపికను బాలీవుడ్‌కు పరిచయం చేసింది ఫరా ఖానే. షారుఖ్ హీరోగా ఫరాఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్ సినిమాలలో దీపిక నటించారు. ఈ క్రమంలో తన చెఫ్ దిలీప్‌తో కలిసి ముంబైలో నటుడు రోహిత్ సరఫ్ ఇంటికి వెళ్లిన ఫరా ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో రోహిత్ తల్లిని ఆమె చూపిస్తూ.. నా సినిమాలో దీపికను ఒప్పించడానికి కూడా ఇంత టైం పట్టలేదంటూ సెటైర్లు వేసింది. అలాగే దీపిక మేడం మన షోకి ఎప్పుడు వస్తారని దిలీప్ అడగ్గా.. 8 గంటలు మాత్రమే పనిచేసే ఆమె మన షోకి రాదంటూ పరోక్షంగా ఆమె వ్యవహారశైలిపై సెటైర్లు వేశారు. కల్కి 2 నుంచి దీపికను తప్పించిన నేపథ్యంలో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











