Just In
- 26 min ago
గతం గురించి ఆలోచించకు.. అదిరిపోయిన ప్లే బ్యాక్ ట్రైలర్
- 38 min ago
KGF Chapter 2లో అదిరిపోయే వాటర్ సీక్వెన్స్: ఆ పది నిమిషాలు అరాచకమేనట
- 57 min ago
‘ఆదిపురుష్’లో సీతగా ఆ హీరోయినే ఫైనల్: ప్రకటనకు ముందే బయటకు వచ్చిన మేటర్
- 59 min ago
ఈ సినిమా చేస్తే కొడతారని చెప్పింది.. అందుకే కాజల్‌కు ఫోన్ చేశా: మంచు విష్ణు
Don't Miss!
- Finance
అయిదేళ్లలో 63% పెరగనున్న కుబేరులు, ప్రపంచంలోనే భారత్ టాప్
- News
ఏపీ మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్- 16 పిటిషన్లను తోసిపుచ్చిన హైకోర్టు
- Automobiles
525 హార్స్ పవర్ వి8 ఇంజన్‌తో వస్తున్న మోస్ట్ పవర్ఫుల్ డిఫెండర్ వి8
- Sports
అక్షర్‌తో హార్దిక్ ఇంటర్వ్యూ.. మధ్యలో దూరి కోహ్లీ ఏమన్నాడంటే? గుజరాతీ భాషలో వీడియో
- Lifestyle
marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సత్తా చాటిన గల్లీ బాయ్.. ఆనందంలో తాప్సీ.. అట్టహాసంగా వేడుకలు
బాలీవుడ్‌లో ఏటా ఫిల్మ్‌ఫేర్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాదికి గానూ అసోంలోని గువాహటిలో ఉన్న ఇందిరా గాంధీ అథ్లెటిక్ స్టేడియంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ 65వ అమెజాన్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2020 వేడుకకు బాలీవుడ్ తారాగణం కదిలి వచ్చింది. ఈ వేడుకకు నిర్మాత కరణ్‌జోహార్, నటుడు విక్కీ కౌశల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఏ ఏ చిత్రాలు అవార్డులు గెలుచుకున్నాయి.. ఎవరికి ఏ అవార్డుల వచ్చాయో ఓ సారి చూద్దాం.

సత్తా చాటిన గల్లీ బాయ్
బాలీవుడ్‌లో గతేడాది వచ్చిన చిత్రాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డులు ప్రధానం చేశారు. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా నటించిన ‘గల్లీ బాయ్' సినిమా ఏకంగా 13 అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, చిత్రం, సహాయ నటుడు, సహాయ నటి, మ్యూజిక్ ఆల్బమ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ ఇలా పదమూడు క్యాటగిరీల్లో గల్లీబాయ్ సత్తా చాటింది.

ఆనందంలో తాప్సీ..
ప్రస్తుతం బాలీవుడ్‌లో తాప్సీ హవా కొనసాగుతోంది. పింక్, బాద్లా, సాండ్ కీ ఆంఖ్ వంటి వరుస బ్లాక్ బస్టర్‌లతో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. గతేడాది సాండ్ కీ ఆంఖ్‌లో ఉత్తమ నటన కనబర్చినందుకు క్రిటిక్స్ క్యాటగిరీలో ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు థ్యాంక్స్ తెలిపింది.

అట్ట హాసంగా వేడుకలు..
ఫిలిం ఫేర్ వేడుకలో రణ్‌వీర్ సింగ్, కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్ తమ డ్యాన్సులతో అదరగొట్టారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరో హీరోయిన్లు తమ స్టైలింగ్‌తో కెమెరా కళ్లకు పని చెప్పారు.

డెబ్యూలో అవార్డులు..
మర్ద్ కో దర్ద్ నహీ హోతాతో హీరోగా పరిచయమైన అభిమన్యు దస్సానికి బెస్డ్ డెబ్యూ హీరోగా, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 ద్వారా పరిచయమైన అనన్య పాండేకు ఉత్తమ నటిగా అవార్డు లభించింది. యూరీ ది సర్జికలర్ స్ట్రైక్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన దర్శకుడు ఆదిత్య ధర్‌కు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా అవార్డు లభించింది.