twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    2018 సంవత్సరం ఈ మగ్గురు స్టార్ హీరోలకు షాకిచ్చింది... కారణం ఏమిటి?

    |

    బాలీవుడ్ చిత్ర సీమలో ఖాన్ త్రయం సల్మాన్, అమీర్, షారుక్ గత మూడు దశాబ్దాలుగా తమ హవా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రతి ఏడాది వీరిలో ఒకరు కాకపోయినా మరొకరు బాక్సాఫీసు వద్ద తమ సత్తా చాటుతూ వస్తున్నారు. హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించే సినిమాలతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గతంలో చూశాం. అయితే 2018 సంవత్సరం ఈ ముగ్గురు హీరోలకు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అందుకు కారణాలు అనేకం.

    ఈ సంవత్సరం ఫెయిల్యూర్‌కు ముఖ్యకారణంగా బాలీవుడ్ బడా నిర్మాతలు, చివరకు దర్శకులు కూడా వారి స్టార్ ఇమేజ్‌ మీద ఆధార పడి సినిమాలు తీయడం, కేవలం వారినే నమ్ముకుని కంటెంటుకు రెండో ప్రాధాన్యత ఇవ్వడం లాంటి పరిణామాల వల్లే అని సినీ విశ్లేషకుల వాదన. అమీర్ ఖాన్ హీరోగా రూపొందిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' అందుకు ముఖ్య ఉదాహరణగా చెబుతున్నారు.

     ప్రేక్షుకుల అభిరుచి మారుతోంది

    ప్రేక్షుకుల అభిరుచి మారుతోంది

    ప్రేక్షకుల అభిరుచి క్రమక్రమంగా మారిపోతోంది. సరికొత్త కంటెంట్ ఉన్న భిన్నమైన సినిమాలకు ఆదరణ పెరుగుతోంది. ఆ రూట్లో ప్రయాణిస్తున్న ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్ లాంటి చిన్న హీరోలు విజయాలు అందుకుంటున్నారు. నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతున్నారు.

     తిప్పికొడుతున్న ప్రేక్షకులు

    తిప్పికొడుతున్న ప్రేక్షకులు

    ఎంత పెద్ద హీరో అయినా సినిమా కథల్లో దమ్ము లేకుంటే ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిప్పికొడుతున్నారు. ప్రేక్షకులను మెప్పించలేని కథలతో వస్తే నెం.1 స్టార్ హీరోల సినిమాలు సైతం వారం రోజుల్లోనే థియేటర్లను నుంచి ఎత్తివేయాల్సిన పరిస్థితి.

    2018లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్... ఎన్నికోట్ల నష్టం అంటే? 2018లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీస్... ఎన్నికోట్ల నష్టం అంటే?

    ఖర్చుకు తగిన ప్రతిఫలం దక్కితేనే

    ఖర్చుకు తగిన ప్రతిఫలం దక్కితేనే


    ప్రస్తుతం సినిమా టిక్కెట్ల రేట్లు కూడా బాగా పెరగడంతో.... ఏదైనా సినిమాకు వెళ్లే ముందుకు ప్రేక్షకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. తాము ఖర్చుపెట్టే డబ్బుకు తగిన సంతృప్తి లభిస్తుంది అనే నమ్మకం ఉంటేనే వెళుతున్నారు. కంటెంట్ బావుందనే టాక్ వస్తే ఆయా సినిమాలకు మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. లేదంటే... పెద్ద హీరోల భారీ బడ్జెట్ సినిమాలు సైతం చతికిలపడక తప్పడం లేదు.

    గడ్డు పరిస్థితితో షారుక్ కెరీర్

    గడ్డు పరిస్థితితో షారుక్ కెరీర్

    బాలీవుడ్ బాద్ షాగా ఇండస్ట్రీని ఏలిన షారుక్ ఖాన్ ప్రస్తుతం తన కెరీర్లో చాలా గడ్డు పరిస్థితి ఎదురుర్కొంటున్నారు. గత కొన్నేళ్లుగా ఆయనకు సరైన హిట్ లేదు. తాగా షారుక్ నటించిన ‘జీరో' చిత్రం రూ.200 కోట్లతో తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ప్రేక్షకులతో పాటు క్రిటిక్స్‌ను సైతం మెప్పించడంలో విఫలం అయింది.

    హిట్టు కొట్టి ఐదేళ్లయింది

    హిట్టు కొట్టి ఐదేళ్లయింది

    షారుక్ ఖాన్ నటించిన చివరి సూపర్ హిట్ మూవీ వచ్చి దాదాపు ఐదేళ్లయింది. 2013లో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్' బాక్సాఫీసు వద్ద రూ. 424 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఆయన చేసిన ‘యే దిల్ హై ముష్కిల్', ‘హ్యారీ మెట్ సెజల్' లాంటివి రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడంలో కూడా విఫలం అయ్యాయి.

    సల్మాన్‍‌ ఖాన్‌కు పరాజయం తప్పలేదు

    సల్మాన్‍‌ ఖాన్‌కు పరాజయం తప్పలేదు

    మరో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ ఏడాదితో ఇండస్ట్రీలో 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సంవత్సరం ఆయన సినిమాలు, టెలివిజన్ షోలు, బ్రాండ్ ఎడార్స్మెంట్ల ద్వారా రూ. 253.25 కోట్లు సంపాదించాడు. ఇండియాలో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్. 2018లొ సల్మాన్ ఖాన్ నటించిన ‘రేస్ 3' కూడా బాక్సాఫీసు వద్ద చతికిలపడింది. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరినప్పటికీ రూ. 160 కోట్ల కంటే ఎక్కువ బిజినెస్ జరుగక పోవడంతో నష్టాలు తప్పలేదు.

    సత్తా చాటుతున్న యంగ్ స్టార్స్

    సత్తా చాటుతున్న యంగ్ స్టార్స్

    ప్రస్తుతం బాలీవుడ్లో చాలా మార్పు వచ్చింది. చాలా సినిమాలు కంటెంటు బావుంటేనే ప్రేక్షకారదణ పొందుతున్నాయి. అలియా భట్, విక్కీ కౌశల్, రాజ్ కుమార్ రావ్, ఆయుష్మాన్ ఖురానా లాంటి వారు మంచి కథలు ఎంచుకుంటూ తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటి ట్రెండ్‌కు తగిన విధంగా వారి సినిమాలు ఉండటంతో మంచి విజయం అందుకంటున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అతిపెద్ద ప్లాప్

    థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ అతిపెద్ద ప్లాప్

    2018లో అమీర్ ఖాన్ మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఇమేజ్ కూడా దెబ్బంది. ఈ ఏడాది ‘థగ్స్ ఆప్ హిందూస్థాన్' సినిమాతో కెరీర్లోనే అతిపెద్ద ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నారు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ అతి కష్టం మీద రూ. 150 కోట్లు వసూలు చేసింది.

     భారీగా తగ్గిన ఖాన్ త్రయం వాటా

    భారీగా తగ్గిన ఖాన్ త్రయం వాటా

    సాధారణంగా ప్రతి ఏడాది ఈ ముగ్గురు ఖాన్స్ నటించే సినిమాల వాటా మొత్తం బాలీవుడ్ బిజినెస్‌లో 20 శాతం ఉంటుంది. 2018లో ఈ ముగ్గురు హీరోల సినిమాల వాటా 10 శాతం కూడా లేక పోవడం గమనార్హం.

    English summary
    Bollywood Khan trio Salman, Aamir and Shahrukh Failed to reach box office expectations In 2018. Generally three stars contribute up to 20 percent to the box office collections of a year. In 2018, however, three releases by the trio hardly sum up to 10 percent.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X