»   » శ్రీదేవి ఎర్ర చీరలో అందంగా ఉంది, ప్రశాంతమైన మరణం, ఇక శాశ్వత శాంతి!

శ్రీదేవి ఎర్ర చీరలో అందంగా ఉంది, ప్రశాంతమైన మరణం, ఇక శాశ్వత శాంతి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Sridevi Mortal being taken for Cremation, Watch Video

మనం ఇంతకాలం అభిమానించి, ఆరాధించిన శ్రీదేవి ఇక లేరు. క్రమక్రమంగా ఈ విషాదాన్ని అభిమానులు జీర్ణించుకోక తప్పదు. శ్రీదేవితో కలిసి పని చేసిన పలువురు సినీ ప్రముఖులు, ఆమె సినిమాలు చూసి ఆరాధించిన అభిమానులు శ్రీదేవి భౌతిక కాయాన్ని సందర్శించి కన్నీంటి పర్యంతం అవుతున్నారు. శ్రీదేవి కడసారి చూసిన అనంతరం ప్రముఖ నటి హేమామాలిని ట్విట్టర్ ద్వారా స్పందించారు.

ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా

‘శ్రీదేవి కడసారి చూపు నాకు దక్కింది. ఆమెను చూడటం ఇక ఇదే చివరి సారి. ఇండస్ట్రీ మొత్తం దు:ఖంలో ఉంది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు. సినిమాకు ఆమె తన అందం, నటనతో వెలుగునిచ్చారు, మ్యాజిక్ చేశారు. అలాంటి వ్యక్తి లేరనే విషయాన్ని ఎవరూ తట్టుకోలేక పోతున్నారు. అంతిమ యాత్రలో శ్రీదేవి ఎరుపు రంగు చీరలో ఎంతో అందంగా ఉన్నారు. ప్రశాంతమైన మరణం. ఇక పూర్తి శాంతి' అంటూ హేమా మాలిని ట్వీట్ చేశారు.

ఏర్పాట్లు బాగా చేశారు

శ్రీదేవి అంతిమ యాత్రలో అరేంజ్మెంట్స్ బావున్నాయి. ఇక్కడి అట్మస్పియర్ శాంతంగా ఉండేటట్లు ఏర్పాట్లు జరిగాయి, ప్రతిదీ స్మూత్‌గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేశారు. గుడ్ బై డియర్ ఫ్రెండ్.... అంటూ హేమా మాలిని పేర్కొన్నారు.

సుష్మితా సేన్ ట్వీట్

శ్రీదేవి భౌతిక కాయాన్ని సందర్శించిన అనంతరం ప్రముఖ నటి సుష్మితా సేన్ పై విధంగా ట్వీట్ చేశారు.

అభిషేక్ బచ్చన్ ట్వీట్

శ్రీదేవి చివరి చూపు అనంతరం అభిషేక్ బచ్చన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పై విధంగా ట్వీట్ చేశారు.

English summary
Hema Malini, who attended Sridevi's prayer meet, tweeted about her feelings when she saw Sridevi for one last time. She wrote: "Paid my last respects to Sridevi. The entire industry was there grieving, some on the verge of breakdown. Such was her aura & magic in films. She lay there, beautiful in a red saree, serene in death & totally at peace.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu