twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హృతిక్ రోషన్ తండ్రికి క్యాన్సర్.. బాలీవుడ్‌కు మరో షాక్.. లవ్యూ డాడీ అంటూ!

    |

    బాలీవుడ్ కు ఇది మరో షాకింగ్ న్యూస్. ఇటీవల కొన్ని రోజులుగా బాలీవుడ్ లో క్యాన్సర్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ప్రముఖ దర్శక నిర్మాత, హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ క్యాన్సర్ బారీన పడ్డారు. తన తండ్రి గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారని హృతిక్ రోషన్ తాజాగా సోషల్ మీడియాలో తెలిపారు. దీనితో బాలీవుడ్ సెలెబ్రిటీలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని సందేశాలు పెడుతున్నారు. తన రాకేష్ రోషన్ దర్శత్వంలో హృతిక్ త్వరలో క్రిష్ 4 చిత్రంలో నటించాల్సి ఉంది.

    ఫోటో దిగాలని అనిపించింది

    ఈ రోజు ఉదయాన్నే నాన్నతో ఫోటో దిగాలని అనిపించింది. ఆయన శస్త్ర చికిత్స రోజు కూడా జిమ్ కు రాకుండా ఉండరు. నాన్న కొన్ని వారాలుగా గొంతు క్యాన్సర్ తో భాదపడుతున్నారు. ఆయన చాలా ధృడమైన వ్యక్తి. క్యాన్సర్ వ్యాధితో పోరాటం చేస్తూనే సంతోషంగా ఉన్నారు. మా కుటుంబానికి ఆయన లాంటి లీడర్ ఉండడం మా అదృష్టం.. లవ్యూ డాడీ అంటూ హృతిక్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

    సోషల్ మీడియాలో వైరల్

    సోషల్ మీడియాలో వైరల్

    హృతిక్ రోషన్ ఇంస్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టిన మూడు గంటల్లోనే మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. హృతిక్ రోషన్ అభిమానులంతా మీ తండ్రి త్వరగా కోలుకోవాలని విష్ చేస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ రోషన్ దర్శత్వంలో క్రిష్ 4 చిత్రంలో నటించేందుకు హృతిక్ సిద్ధం అవుతున్నాడు. తాజాగా ఆయనకు క్యాన్సర్ ఉందని తేలడంతో క్రిష్ 4 చిత్రం ఎలా ముందుకు వెళుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

     ప్రాధమిక దశలోనే

    ప్రాధమిక దశలోనే

    గొంతు క్యాన్సర్ రాకేష్ రోషన్ కు ప్రాధమిక దశలోనే ఉంది. చికిత్స కూడా చేయించుకుంటుండడంతో ప్రమాదం ఏమీ లేదని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రాకేష్ రోషన్ క్యాన్సర్ చికిత్స కారణంగా క్రిష్ 4 ప్రిప్రొడక్షన్ పనులు కొన్ని రోజుల పాటు నిలిపివేయనున్నారు. రాకేష్ రోషన్ తిరిగికోలుకోగానే క్రిష్ 4 చిత్ర షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    బాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా

    బాలీవుడ్ సెలెబ్రిటీలు వరుసగా

    ఇటీవల వరుసగా బాలీవుడ్ సెలెబ్రిటీలు క్యాన్సర్ బారీన పడుతున్నారు. గత ఏడాది అందాల తార సోనాలి బింద్రే క్యాన్సర్ వ్యాధికి గురి కావడం బాలీవుడ్ మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. ఇర్ఫాన్ ఖాన్ కూడా కక్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. రిషి కపూర్ కూడా క్యాన్సర్ వ్యాధితో భాదపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Hrithik Roshan shared on his Instagram that his father Rakesh Roshan was diagnosed with throat cancer
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X