Just In
Don't Miss!
- News
రిపబ్లిక్ డే: ట్రాక్టర్ ర్యాలీకి రూట్ మ్యాప్.. పరేడ్ నేపథ్యంలో ఆంక్షలు.. పబ్లిక్కు కూడా..
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Lifestyle
Republic Day 2021 : పరేడ్ లో పురుషుల కవాతుకు నాయకత్వం వహించిన ఫస్ట్ లేడో ఎవరంటే...
- Sports
World Test Championship ఫైనల్ వాయిదా!!
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
క్రికెటర్‌తోపాటు సూపర్ స్టార్ భార్య అరెస్ట్.. ముంబై పోలీసులు భేష్ అంటూ సెలబ్రిటీ వివరణ
స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా, యువ గాయకుడు గురు రాంధ్వా అరెస్ట్ ముంబైలో కలకలం రేపింది. ఈ వ్యవహారంలో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ అరెస్ట్ వార్త మరింత సంచలనం కలిగించింది. అయితే తన అరెస్ట్ వార్తపై సుసానే ఖాన్ జాతీయ మీడియాకు వివరణ ఇచ్చారు. తన అరెస్ట్ వార్త వెనుక అసలు విషయాన్ని బయటపెడుతూ..

సురేష్ రైనా, గురు రాంధ్వా అరెస్ట్
ముంబైలోని విలాసవంతమైన క్లబ్‌లో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో సురేష్ రైనా, గురు రాంధ్వాలను పోలీసులు అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేయడం జరిగిపోయింది. ఈ క్రమంలో సుసాన్ ఖాన్ అరెస్ట్ అయినట్టు మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

ముంబైలోని హోటల్‌లో జరిగిన పార్టీలో
సోమవారం రాత్రి నేను నా క్లోజ్ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యాను. జేడబ్లూ మారియట్‌లోని డ్రాగన్ ఫ్లై క్లబ్‌లో తెల్లవారే వారకు అంటే 2.30 గంటల వరకు పార్టీ జరిగింది. అప్పుడే పోలీసులు క్లబ్‌లోకి వచ్చారు. హోటల్ యాజమాన్యం వారితో సంప్రదింపులు జరిపారు. దాంతో 3 గంటల వరకు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో మమ్మల్ని బయటకు వెళ్లడానికి అనుమతించారు అని సుసాన్ ఖాన్ తెలిపారు

నా అరెస్ట్ గురించి తప్పుగా
జేడబ్లూ మారియట్‌లో తెల్లవారే సరికి ఉండాల్సి రావడంతో నన్ను అరెస్ట్ చేశారనే వార్తలు మీడియాలో వచ్చాయి. ఎలాంటి క్లారిఫికేషన్ లేకుండా వార్తలు రాశారు. నా అరెస్ట్ వార్త తప్పుగా రాశారు. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం బాధగా ఉంది అంటూ సుసాన్ ఖాన్ పేర్కొన్నారు.

నా క్లారిఫికేషన్ ఇదే..
అయితే తన అరెస్ట్ వార్త గురించి సుసాన్ ఖాన్ వివరణ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. అయితే మీకు విన్రమంగా ఓ క్లారిఫికేషన్ ఇవ్వాలనుకొంటున్నాను. నా అరెస్ట్ వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ విషయంలో నా కంటే ముందే క్లారిటీ ఇచ్చిన ముంబై పోలీసులకు థ్యాంక్స్ అని సుసాన్ ఖాన్ అన్నారు.

ముంబై పోలీసులు కృషిపై ప్రశంసలు
హోటల్ యాజమాన్యానికి, ముంబై పోలీసులకు మధ్య జరిగిన వాదనల గురించి నాకు తెలియదు. కానీ ముంబై నగరాన్ని సురక్షితంగా ఉంచడానికి పోలీసు చేస్తున్న కృషికి అభినందనీయం. ప్రజల కోసం వారు చేస్తున్న ప్రయత్నాలు నన్ను కదిలించాయి అని సుసాన్ ఖాన్ అన్నారు. సోమవారం రాత్రి ముంబై పోలీసులు జరిపిన మెరుపుదాడుల్లో 34 మందిని అరెస్ట్ చేసి వారిపై సెక్షన్ 188, 269 కింద కేసులను నమోదు చేశారు.