twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మీటూ: సైఫ్ అలీ ఖాన్ బాధితుడే... కూతురు సారాతో తప్పుగా ప్రవర్తిస్తే...?

    |

    #మీటూ ఉద్యమం తీవ్రతరం అయిన నేపథ్యంలో పలువురు స్టార్స్ తమకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. లైంగిక వేధింపులకు గురైన వారికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ #మీటూ ఉద్యమంపై స్పందించారు. వేధింపులకు గురైన వారికి తన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

    నా భర్తని టార్గెట్ చేశారు.. ఇలాంటి వాళ్ళు శ్రీకృష్ణుడిపై కూడా నిందలు వేస్తారు.. నటి దివ్య ఖోస్లా!నా భర్తని టార్గెట్ చేశారు.. ఇలాంటి వాళ్ళు శ్రీకృష్ణుడిపై కూడా నిందలు వేస్తారు.. నటి దివ్య ఖోస్లా!

    వేధింపులకు గురైనపుడు ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ బాధ అనుభవించిన వాడినే. అయితే తాను లైంగిక పరమైన వేధింపులకు గురి కాలేదు కానీ, తనను మానసికంగా వేధించారని, 25 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటనపై తనలో ఇంకా కోపం పోలేదన్నారు సైఫ్.

    ఆ బాధ జీవితాంతం ఉంటుంది

    ఆ బాధ జీవితాంతం ఉంటుంది

    చాలా మంది ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. మరొక వ్యక్తి బాధను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయితే ఇపుడు నేను దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు, ఎందుకంటే అది ఇపుడు ముఖ్యం కాదు. ఆ రోజు జరిగిన సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ కోపం వస్తుంది. అలాంటిది లైంగిక వేధింపులకు గురైతే ఆ బాధ జీవితాంతం ఉంటుందని సైఫ్ అలీ ఖాన్ తెలిపారు.

    వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే

    వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే

    లైంగిక వేధింపులకు ఎవరు పాల్పడినా అది క్షమించరాని నేరం. తప్పు చేసిన వారు అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. వారి దురాగతాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిందే అని సైఫ్ అభిప్రాయ పడ్డారు.

     సాజిత్ ఖాన్ వేధింపుల గురించి

    సాజిత్ ఖాన్ వేధింపుల గురించి

    లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న దర్శకుడు సాజిద్ ఖాన్ డైరెక్షన్లో సైఫ్ అలీ ఖాన్, బిపాసా బసు, ఈషా గుప్త గతంలో ‘హల్ షకల్స్' అనే చిత్రం నటించారు. ఆ సమయంలో సాజిద్ ఖాన్ మహిళల పట్లు ఎంత నీచంగా ప్రవర్తించేవాడో బిపాసా, ఈషా ఇటీవలే బయట పెట్టారు. ముగురు నటీమణులపై, ఒక జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకుగాను అతడిని హౌస్‌ఫుల్ 4 దర్శకుడిగా తొలగించారు.

    అప్పుడు ఏం జరిగిందో తెలియదు

    అప్పుడు ఏం జరిగిందో తెలియదు

    ‘హమ్‌షకల్స్' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విషయాలు తన దృష్టికి రాలేదని, ఒక వేళ వస్తే తాను చూస్తూ ఊరుకునేవాడిని కాదని సైఫ్ అన్నారు. సాజిద్ ఖాన్‌ను లాంటి వ్యక్తులతో పని చేసినందుకు సిగ్గుగా ఉంది, అతడి వేధింపుల గురించి తెలిసి షాకయ్యాను. లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తులతో తాను పని చేయబోనని సైఫ్ అలీ ఖాన్ తేల్చి చెప్పారు.

    నా కూతురు సారాతో తప్పుగా ప్రవర్తిస్తే..

    నా కూతురు సారాతో తప్పుగా ప్రవర్తిస్తే..

    నా కూతురు సారా అలీ ఖాన్ కూడా సినిమాల్లో పని చేస్తోంది. ఒక వేళ ఆమెకు ఇలాంటి సంఘటనలు ఎదురైనట్లు, ఎవరైనా తప్పుగా ప్రవర్తించినట్లు నా దృష్టికి వస్తే వెంటనే అతడి మొహంపై పంచ్‌లు గుప్పిస్తూ పచ్చడి చేస్తాను, ఒక తండ్రిగా నేను రియాక్ట్ అయ్యే విధానం అలా ఉంటుంది. ఆ తర్వాత కోర్టులో తేల్చుకుంటానని తెలిపారు.

    English summary
    "I have also been harassed in my career, not sexually, but I have been harassed 25 years ago and I am still angry about it," Saif Ali Khan told PTI."Most people don't understand other people. It is very difficult to understand other people's pain. I don't want to talk about it because I am not important today. Even when I think about what happened with me I still get angry. Today, we have to look after women," he added.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X