twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా కన్విన్స్ అయ్యా... లేకపోతే ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ చేసేవాడిని కాదు: షాహిద్ కపూర్

    |

    తెలుగులో సూపర్ హిట్ అయిన కల్ట్ మూవీ 'అర్జున్ రెడ్డి' హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్‌కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు. 'కబీర్ సింగ్' పేరుతో ఈ మూవీ జూన్ 21న విడుదల కాబోతోంది.

    ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిద్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''అర్జున్ రెడ్డి' సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ చాలా నచ్చింది. ఒక కల్ట్ చిత్రాన్ని తెరకెక్కించిన విధంగా నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే 'అర్జున్ రెడ్డి' సినిమా చూసిన వెంటనే నాకు ఒకటే ఆలోచన వచ్చింది... ఒక మంచి చిత్రాన్ని మళ్లీ చేయడం ఎందుకు? ఒక వేళ ఆ మ్యాజిక్ క్రియేట్ చేయలేక పోతే పరిస్థితి ఏమిటి? అనిపించింది.'' అని షాహిద్ చెప్పుకొచ్చారు.

    I thought why make such a nice film again? Shahid Kapoor about Arjun Reddy remake

    కానీ నా సన్నిహితులు ఈ సినిమా చేయాలని ప్రోత్సహించారు. నేను ఒక మంచి పాత్ర చేసే అవకాశం వదులుకోవద్దని వారు సూచించారు. అపుడు వారికి నేను ఒకటే కండీషన్ పెట్టాను. ఒరిజినల్ సినిమాను డైరెక్ట్ చేసిన వారే ఈ సినిమా చేయాలి, లేకుంటే చేయను అని చెప్పాను. వేరే వారు అయితే ఆ పాత్రను పూర్తిగా అర్థం చేసుకోలేరనేది నా భావన. లక్కీగా సందీప్ రెడ్డి వంగా హిందీలో చేయడానికి ఒప్పుకున్నారు. నేను కన్విన్స్ అవ్వడానికి ప్రధాన కారణం అదే అని షాహిద్ కపూర్ తెలిపారు.

    English summary
    "The first thing I felt after watching the Arjun Reddy film was why make such a nice film again? What if you can’t recreate the magic? But my loved ones pushed me towards doing it because they felt that I should not let go of such a good role. " Shahid Kapoor said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X