twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బట్టలిప్పితే ఆఫరిస్తానన్నాడు.. చాలా అసభ్యంగా పిచ్చి చేష్టలు.. దర్శకుడిపై మోడల్ ఫైర్

    |

    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గత రెండేళ్లుగా మీటూ ఆరోపణలు ఏ రేంజ్ లో వస్తున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోల పేర్లతో పాటు, సీనియర్ దర్శక నిర్మాతల పేర్లు కూడా చాలానే బయటకు వచ్చాయి. ముఖ్యంగా హౌజ్ ఫుల్ 1,2లతో మంచి క్రేజ్ అందుకున్న ప్రముఖ దర్శకుడు సాజిద్ ఖాన్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2018లోనే అతనిని చాలా మంది స్టార్స్ దూరం పెట్టారు. ఇక ఇప్పుడు పౌలా అనే ఒక ఇండియన్ మోడల్ సాజిద్ వల్ల ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బయటకు చెప్పింది.

    హౌజ్ ఫుల్ సినిమా కోసం..

    హౌజ్ ఫుల్ సినిమా కోసం..

    బుధవారం, పౌలా అనే భారతీయ మోడల్, హౌజ్ ఫుల్ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనకు లైంగికంగా వేధించాడని ఆరోపించారు. హౌజ్ ఫుల్ అనే సినిమా కోసమే ఈ వివాదం చోటు చేసుకున్నట్లు ఆమె తెలిపింది. పౌలా ఒక నోట్ లో తనకు ఎదురైన చేదు అనుభవాలు గురించి పూర్తిగా వివరణ ఇచ్చింది.

    అందుకే అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాను

    అందుకే అప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాను

    17 సంవత్సరాల వయస్సులో సాజిద్ ఖాన్ వల్ల లైంగిక వేధింపులకు గురయ్యాను. "#MeToo ఉద్యమం ప్రారంభమైనప్పుడు చాలా మంది ప్రజలు సాజిద్ ఖాన్ గురించి మాట్లాడారు. కాని నేను ధైర్యం చేయలేదు. ఎందుకంటే నేను ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాను. గాడ్ ఫాదర్ కూడా లేడు. కుటుంబ మర్యాద కోసమే అప్పుడు నిశ్శబ్దంగా ఉండాల్సి వచ్చింది.

    17 ఏళ్ల వయసులో ఇబ్బంది కలిగించాడు

    17 ఏళ్ల వయసులో ఇబ్బంది కలిగించాడు

    ఇక ఇప్పుడు నా తల్లిదండ్రులు నాతో లేరు. నేను సొంతంగా సంపాదిస్తున్నాను. అందుకే ధైర్యంగా ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పాలని అనుకుంటున్నాను. నేను సాజిద్ ఖాన్ చేత వేధింపులకు గురయ్యాను. 17 సంవత్సరాల వయస్సులో సినిమా అవకాశం పేరుతో అతను నన్ను చాలా ఇబ్బంది కలిగించాడు. ప్రజాస్వామ్యం చనిపోయే ముందే నేను నిజాల గురించి మాట్లాడాలని అనుకున్నాను.

    ఎక్కడపడితే అక్కడ తాకడానికి..

    ఎక్కడపడితే అక్కడ తాకడానికి..

    "అతను నాతో అసభ్యంగా మాట్లాడాడు, అతను ఎక్కడపడితే అక్కడ తాకడానికి ప్రయత్నించాడు. రాబోయే హౌస్‌ఫుల్ మూవీలో అవకాశం రావాలి అంటే తన ముందు బట్టలు విప్పేసి స్ట్రిప్ చేయాలని అన్నాడు. ఇంతకుముందు దీని గురించి మాట్లాడకపోవడం వలన తప్పు చేశానని అనిపిస్తోంది. కాని అది చిన్నతనంలో నన్ను తీవ్రంగా ప్రభావితం చేసిందని ఇప్పుడు తెలుసుకున్నాను.

    మీ కలలను తారుమారు చేస్తారు

    మీ కలలను తారుమారు చేస్తారు

    అలాంటి వ్యక్తులు కాస్టింగ్ కౌచ్ మాత్రమే కాదు, మీ కలలను తారుమారు చేస్తారు. చెడ్డపేరు వచ్చేలా చేస్తారని పౌలా పేర్కొంది. ఇక 2018 లో సాజిద్ పై ఒక జర్నలిస్టుతో సహా పలువురు మహిళా నటీమణులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. దీంతో హౌస్‌ఫుల్ 4 యొక్క నిర్మాతలు ఈ చిత్ర దర్శకుడితో డీల్ క్యాన్సిల్ చేసుకొని డైరెక్టర్ పోస్ట్ నుంచి తప్పించారు. దీంతో అప్పటి నుంచి సాజిద్ బయటప్రపంచనికి చాలా తక్కువగా కనిపిస్తున్నాడు.

    English summary
    harassment is prevalent in all sectors, not just in the film industry. Otherwise the film industry is special so everyone here is very focused. This is what many heroines say. But in the film industry, if there are opportunities to share the beds, there are others. In fact, it is also annoying to many good heroines.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X