‘ఆ లేడీ ప్రొడ్యూసర్ స్వలింగ సంపర్కురాలా?.. 50 ఏళ్ళ వయసులో లెస్బియన్‌గా’
సినిమా పరిశ్రమలో లైంగిక పరమైన ఆరోపణలు రావడం అత్యంత సహజం. సెలబ్రిటీల శారీరక సంబంధాలు, వివాహేతర బంధాలు, లవ్, డేటింగ్, అఫైర్లపై వచ్చే వార్తలు, వారి గురించి కొందరు సెలబ్రిటీలు చేసే కామెంట్లు సినీ ప్రేక్షకులకు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. అయితే తాజాగా హిందీ సినీ పరిశ్రమలో టాప్ ప్రొడ్యూసర్‌గా ఉన్న మహిళ సెలబ్రిటీ గురించి క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ సంచలన రీతిలో వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఆమె శారీరక సంబంధాల గురించి షాకింగ్‌గా కొన్ని విషయాలు ప్రస్తావించారు. ఆయన చేసిన కామెంట్స్ వివరాల్లోకి వెళితే..
హిందీ సినిమా పరిశ్రమలో టాప్ సీరియల్స్, సినిమాలను అందించే నిర్మాతగా పేరున్న ఏక్తా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ వెటరన్ యాక్టర్, సీనియర్ స్టార్ హీరో జితేంద్ర కూతురిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆమె.. ఆ తర్వాత తన విజన్‌తో సొంతంగా పేరును సంపాదించుకొన్నారు. పురుషాధిక్యత ఉన్న ఇండస్ట్రీలో ఆమె టాప్ ప్రొడ్యూసర్‌గా తన స్థానాన్ని పదిలం చేసుకొన్నారు.

సినిమా పరిశ్రమలో లెజెండరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏక్తా కపూర్ 1995 సంవత్సరంలో పడోసన్ అనే సీరియల్ ద్వారా వినోదరంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత పవిత్ర రిస్తా, హమ్ పాంచ్, కన్యాదన్, కుండలి, క్యోంకి సాస్ భీ కభీ బహు థీ, కహానీ ఘర్ ఘర్ కీ, కసౌటీ జిందగీ కే, ఖయామత్, కిస్ దేశ్ మే హై మేా దిల్, తుజ్ సంగ్ ప్రీత్ లగాయి సజ్నా అనే టాప్ సీరియల్స్ నిర్మించారు.
ఓ వైపు సీరియల్ నిర్మాణం చేపడుతూనే 2001 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి ప్రవేశించి సినిమాలు నిర్మించారు. క్యోంకీ మై ఝుట్ నహీ బోల్తా, కుచ్ తో హై, కృష్ణా కాటేజ్, క్యా కోయి హై హమ్, షూట్ అవుట్ ఎట్ లోఖండ్‌వాలా, మిషన్ ఇస్తాంబుల్, లవ్ సెక్స్ ధోఖా, వన్స్ ఆపాన్ ఏ టైమ్ ముంబై, షోర్ ఇన్ ది సిటీ అనే చిత్రాలను నిర్మించారు.
ఏక్తా కపూర్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 50 ఏళ్లు వచ్చినా ఆమె బ్రహ్మాచారిగానే ఉండిపోయారు. అయితే ఆమె అలా మిగిలిపోవడానికి కారణం యవ్వనంలో జరిగిన బ్రేకప్ అనే రూమర్ ఒకటి మీడియాలో వచ్చింది. అయితే ఆమె లైంగిక జీవన విధానంపై బాలీవుడ్ క్రిటిక్ కేఆర్కే సంచలన విషయాలు బయటపెట్టారు.
ఏక్తా కపూర్ స్వలింగ సంపర్కురాలు (లెస్బియన్). ఆమె విషయం అందరికి తెలుసు. కానీ ఎవరూ కూడా బయటకు చెప్పరు. పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమెకు మగాళ్లంటే ఇష్టం ఉండదు. అమ్మాయిలంటేనే ఇష్టం. ఏక్తా అమ్మాయిలతోనే పార్టీలు చేసుకొంటుంది. వారితోనే పార్టీలు చేసుకొంటుంది అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఏక్తా తనకు ఇష్ట వచ్చిన జీవితాన్నీ లీడ్ చేయడానికి మనం ఎవరు అంటూ ఆయన కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











