3 పెళ్లిళ్లు చేసుకొని భయపెట్టానా? అందుకే మ్యారేజ్‌కు దూరమా?

బాలీవుడ్ మెగాస్టార్, అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కు ఇండియాలో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ సల్మాన్ ఖాన్ చిత్ర పరిశ్రమలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను వెండితెరపై అలరిస్తూనే ఉన్నారు. వరల్డ్ వైడ్ గా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో ఇప్పటికీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. 60 ఏళ్ల వయస్సులోనూ సల్మాన్ ఖాన్ యాక్టివ్ గా సినిమాలు చేస్తుండటం విశేషం.

ఇక సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన పెళ్లి వార్త ఎప్పుడనేది అందరిలో సందేహంగా మిగిలింది. ఆరు పదుల వయస్సులో సల్మాన్ ఖాన్ ఇంకెప్పుడు ఓ ఇంటి వాడు అవుతాడంటూ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు అసలు సల్మాన్ ఖాన్ పెళ్లికి ఎందుకు దూరంగా ఉన్నానేది హాట్ టాపిక్‌గ్గా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ సల్మాన్ ఖాన్ పెళ్లి గురించిన సంభాషణపై ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను అభిమానులతో పంచుకుంది.

Is Salman Khan Scared to Marry by Aamir Khan and Kajol

ఆ వీడియోలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, కాజోల్, నటి ట్వింకిల్ ఖన్నా ఉన్నారు. కాజోల్, ట్వింకిల్ ఖన్నాకు సంబంధించిన చాట్ షో 'టూ మచ్' ఫస్ట్ ఎపిసోడ్ లో వీరిద్దరూ పాల్గొన్నారు. రీసెంట్ గురువారం ప్రైమ్ వీడియోలో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సందర్భంగా షూటింగ్ కు ముందుకు జరిగిన ఒక ఆసక్తికరమైన సంభాషణకు సంబంధించిన వీడియోను కాజోల్ విడుదల చేసింది. ఇందులో కాజోల్, ట్వింకిల్ ఖన్నా, అమీర్ ఖాన్స్, సల్మాన్ పెళ్లి టాపిక్ పై మాట్లాడారు. ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ ను భయపెట్టామని ఫన్నీగా కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఒక భాగస్వామి మరొక భాగస్వామి కంటే ఎక్కువగా ఎదిగినప్పుడు నెమ్మదిగా తేడాలు ప్రారంభం అవుతాయి. అప్పుడే ఇద్దరి మధ్య అభద్రత భావం మొదలవుతుంది. అందుకోసం ఇద్దరు కలిసి ఎదగాలి. ఇద్దరు ఒకరికి ఒకరు సమానంగా ఎదగడం అవసరమని నేను నమ్ముతాను.. అని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ ను పెళ్లిపై ఆసక్తికరంగా ప్రశ్నించాడు. ఇక నేను మూడు పెళ్లిళ్లు చేసుకొని నిన్ను భయపెట్టానా? అని అనడం ఆసక్తికరంగా మారింది.

ఇక అమీర్ ఖాన్ తన రిలేషన్ షిప్స్ గురించి సల్మాన్ ఖాన్ ను అడిగినప్పుడు ఆయన స్పందిస్తూ ఇలా అన్నారు. ఒకరితో అనుకున్నట్లు జరగకపోతే.. అది ఇంకా జరగదని అర్థం. ఇక్కడ ఎవరినైనా నిందించాల్సి వస్తే, అది నన్నే నిందించుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇక సల్మాన్ ఖాన్ పిల్లల గురించి కూడా ఆసక్తికరంగా మాట్లాడారు. భవిష్యత్ లో నాకు పిల్లలు ఉంటారు. ఆ రోజు త్వరలోనే వస్తుందంటూ వారి సంభాషణలో ఉంది. ప్రస్తుతం వారి కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాజోల్ పంచుకున్న వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ ఉన్నారు.

More from Filmibeat

Read more about: salman khan aamir khan kajol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X