twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోగా ఉన్న వాడిని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయా.. ఇండస్ట్రీ చాలా దారుణం!

    |

    చిత్ర పరిశ్రమ చాలా దారుణమైన ప్రదేశం అని అంటున్నారు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్. బిగ్ బి అమితాబ్ బచ్చన్ వారసుడిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ హీరోగా టాప్ లీగ్ లోకి చేరుకోలేకపోయారు. చిత్ర పరిశ్రమలో తన ప్రయాణం గురించి కాఫీ విత్ కరణ్ షోలో మాట్లాడుతూ అభిషేక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాఫీ విత్ కరణ్ షోకు అభిషేక్ తన సోదరి శ్వేతా బచ్చన్ తో కలసి హాజరయ్యాడు. అభిషేక్ కు ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోగా సరైన అవకాశాలు రావడం లేదు. ఈ విషయం గురించి అభిషేక్ చెప్పిన సంగతులు ఇలా ఉన్నాయి.

    రెండేళ్ల గ్యాప్ తర్వాత

    రెండేళ్ల గ్యాప్ తర్వాత

    అభిషేక్ బచ్చన్ హౌస్ ఫుల్ 3 తర్వాత దాదాపు రెండేళ్ల పాటు మరో చిత్రంలో నటించలేదు. రెండేళ్ల గ్యాప్ తర్వాత అభిషేక్ బచ్చన్ మన్మార్జియాన్ చిత్రంలో నటించాడు. అది కూడా క్యారెక్టర్ రోల్ లో. చాలా చిత్రాల్లో కూడా అభిషేక్ బచ్చన్ హీరో తర్వాత ప్రాధానత్య ఉన్న పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. క్యారెక్టర్ రోల్స్, ద్వితీయ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించే సమయంలో ఎలా అనిపిస్తుంది అని కరణ్ జోహార్ ప్రశ్నించగా.. తాను హృదయం బద్దలయ్యే వేదనని అనుభవిస్తున్నాను అంటూ అభిషేక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

    ఇండస్ట్రీ చాలా దారుణం

    ఇండస్ట్రీ చాలా దారుణం

    సినిమా ఇండస్ట్రీలో చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అనేది ముఖ్యం కాదు. ఎలా రాణిస్తున్నావనేదే ఇండస్ట్రీలో ప్రధాన అంశం. హీరోగా రాణిస్తూ క్రమంగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవడం అనేది భరించలేని వేదన అని అభిషేక్ తెలిపాడు. మళ్ళీ స్టార్ హీరోగా మారాలంటే ఈ భాదని భరిస్తూ నేను నీవే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి అని అభిషేక్ తెలిపాడు.

    <strong>మెగాస్టార్ కొడుకు కాబట్టే హీరో.. అతడికి ఏమీ తెలియదు.. నా కుమార్తెకు ఆ గతి పట్టకూడదు!</strong>మెగాస్టార్ కొడుకు కాబట్టే హీరో.. అతడికి ఏమీ తెలియదు.. నా కుమార్తెకు ఆ గతి పట్టకూడదు!

    నెగిటివ్ కామెంట్స్

    నెగిటివ్ కామెంట్స్

    అభిషేక్ బచ్చన్ క్యారెక్టర్ రోల్స్ చేయడంపై ఇలా అతనా అభిప్రయాన్ని తెలియజేశాడు. శ్వేతా బచ్చన్ ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అన్నయ్య గురించి చాలా నెగిటివ్ కామెంట్స్ విన్నా. అనవసరంగా కొందమంది కామెంట్స్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ వారసత్వాన్ని నిలబెట్టడం అంత సులువైన విషయం కాదు. కొన్నిసార్లు అన్నయ్య గురించి విన్న చెడు కామెంట్స్ వలన నిద్రలేని రాత్రులను కూడా గడిపానని శ్వేతా బచ్చన్ తెలిపింది.

     అనురాగ్ బసు దర్శత్వంలో

    అనురాగ్ బసు దర్శత్వంలో

    ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ అనురాగ్ బసు దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కూడా మల్టీస్టారర్ చిత్రమే. విభిన్నమైన నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో కూడా తాను మల్టీస్టారర్ చిత్రాలు కొనసాగిస్తానని అభిషేక్ తెలిపాడు.

    English summary
    It is heartbreaking: Abhishek Bachchan on his supporting role in Manmarziyaan
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X