twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేరళకు సల్మాన్ ఖాన్ రూ. 12 కోట్లు ఇచ్చాడా? నటుడి ట్వీట్‌తో వివాదం!

    By Bojja Kumar
    |

    భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళ రాష్ట్రం ఇతరుల సహాయం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ రిక్వెస్ట్ చేయడంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు, సెలబ్రిటీలు తమ శక్తి మేర సహాయం అందించారు. అయితే ఇదే సమయంలో కొన్ని ఫేక్ న్యూస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొందరు సెలబ్రిటీలు కోట్లరూపాయల విరాళం ఇచ్చినట్లు న్యూస్ స్ప్రెడ్ అయింది. తమిళ స్టార్ విజయ్ 14 కోట్లు ఇచ్చినట్లు ప్రచారం జరిగినా... అతడు ఇచ్చింది 70 లక్షలు మాత్రమే అని తేలిపోయింది.

    సల్మాన్ ఖాన్ 12 కోట్లు ఇచ్చాడా?

    సల్మాన్ ఖాన్ 12 కోట్లు ఇచ్చాడా?

    బాలీవుడ్‌ స్టార్ సల్మాన్‌ ఖాన్‌ సైతం రూ.12 కోట్లు విరాళంగా ప్రకటించినట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేదు. దీనిపై బాలీవుడ్ నటుడు జావేద్ జఫేరీ ట్వీట్ చేయడం వివాదానికి కారణమైంది.

    వరుస కామెంట్లతో ట్వీట్ డిలీట్ చేసిన వైనం

    వరుస కామెంట్లతో ట్వీట్ డిలీట్ చేసిన వైనం

    ‘సల్మాన్‌ కేరళ కోసం రూ.12 కోట్ల విరాళం ప్రకటించారని విన్నాను. అతనిపై ఎందరో ప్రజల ఆశీస్సులు ఉంటాయి. గాడ్‌ బ్లెస్‌ యూ బ్రో' అని జావేద్ జఫరెరీ ట్వీట్ చేయడంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడ్డారు. సల్మాన్ ఖాన్ 12 కోట్లు ఇవ్వలేదని, అది కేవలం ఫేక్ న్యూస్ అని నెటిజన్లు అతడిపై కామెంట్లతో విరుచుకుపడటంతో చివరకు.... తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు.

    నేను అలా అనలేదంటూ...

    తను చేసిన ట్వీటుపై విమర్శలు రావడంతో జావేద్ జఫెరీ వెంటనే దాన్ని దిద్దుకునే ప్రయత్నం చేశారు. ‘సల్మాన్‌ 12 కోట్లు ఇచ్చారని నేను ట్వీట్ చేయలేదు. అలాంటి వార్తలు విన్నాను అని మాత్రమే చెప్పాను. సల్మాన్ లాంటి స్టార్, అతడి ట్రాక్ రికార్డ్స్ చూసిన ఎవరైనా ఇలాంటి వార్తలు నమ్మేస్తారు. నేను కూడా నమ్మాను. ఈ విషయాన్ని ఖరారు చేసేకునే వరకు నా ట్వీట్ వెనక్కి తీసుకుంటున్నాను' అని జావేద్ జఫరీ తెలిపారు.

    బాలీవుడ్లో హాట్ టాపిక్

    బాలీవుడ్లో హాట్ టాపిక్

    జావేద్ జఫరీ.... సల్మాన్ ఖాన్ ఇష్యూను కెలకడంతో ఈ విషయమై బాలీవుడ్లో హాట్ టాపిక్ నడుస్తోంది. సంవత్సరానికి వందల కోట్ల ఆదాయం ఆర్జింజే ఈ స్టార్ కేరళకు ఎంత సహాయం చేశారు? అసలు చేశాడా? లేదా? అనే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

    English summary
    Actor Jaaved Jaaferi tweeted about Salman Khan donating Rs 12 crore as his contribution for the relief and rehabilitation of those affected by Kerala floods, only to delete it later. “I had tweeted that I had ‘heard’ about BeingSalmanKhan ‘s bcontribution. Because it was a very strong possibility given his track record, I put forward my thoughts and admiration,” he tweeted. Salman has not commented on this.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X