»   » రూమర్లకు చెక్.. తల్లి కోరిక కోసం జాహ్నవి.. విషాదాన్ని పక్కన పెట్టి..!

రూమర్లకు చెక్.. తల్లి కోరిక కోసం జాహ్నవి.. విషాదాన్ని పక్కన పెట్టి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులతో ఆమె కుటుంబం కూడా తల్లడిల్లిపోయింది. ఇక శ్రీదేవి కూతుళ్లు జాహ్నవి, ఖుషీల పరిస్థితి చెప్పనక్కర్లేదు. తల్లి లేరనే విషాదం నుంచి ఇప్పుడిప్పుడే జాహ్నవి, ఖుషీ, బోనీకపూర్‌లు బయటపడుతున్నారు. దు:ఖం నుంచి తేరుకొని జాహ్నవి మళ్లీ ధడక్ సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. షూటింగ్‌లోని జాహ్నవి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

శ్రీదేవి మరణం తర్వాత

శ్రీదేవి మరణం తర్వాత

శ్రీదేవి మరణం తర్వాత జాహ్నవి తొలి పుట్టిన రోజును ఇటీవలే జరుపుకొన్నారు. 21 పడిలోకి అడుగుపెట్టిన ఆమె అనాథ శరణాలయంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకొన్నారు.

శ్రీదేవి కోరిక కోసం

శ్రీదేవి కోరిక కోసం

తనను గొప్ప స్టార్‌గా చూడాలనుకొన్న తన తల్లి కోరిక కోసం జాహ్నవి తన విషాదాన్ని పక్కన పెట్టింది. గురువారం నుంచి జాహ్నవి షూటింగ్‌‌లో పాల్గొన్నది. జాహ్నవిపై కొన్ని రొమాంటిక్ సీన్లు షూట్ చేస్తున్నట్టు సమాచారం.

ముంబైలో షూటింగ్

ముంబైలో షూటింగ్

ముంబైలో బాంద్రాలోని కార్టర్ రోడ్‌లో జరిగిన షూటింగ్‌లో హీరో ఇషాన్ ఖట్టర్‌తో కలిసి నటించింది. వారిద్దరిపై కొన్ని సీన్లు షూట్ చేశారు. తల్లి మరణం నేపథ్యంలో ఇంకా కొన్ని రోజులు షూటింగ్‌కు రాదని అనుకొన్న వారికి జాహ్నవి అనూహ్యంగా షాక్ ఇచ్చింది.

 ఇషాన్ కట్టర్‌, జాహ్నవిపై సీన్లు

ఇషాన్ కట్టర్‌, జాహ్నవిపై సీన్లు

బంద్రాలో మరికొన్ని రోజులు జరిగే షూటింగ్‌లో జాహ్నవి, ఇషాన్ పాల్గొంటారు. వారిపై కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను షూట్ చేయనున్నారు. వచ్చే వారం తదుపరి షెడ్యూల్ కోసం కోల్‌కతా వెళ్లనున్నారు.

కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా

కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా

ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఎపిసోడ్స్‌ను కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌గా తెరకెక్కించనున్నారు. రాజస్థాన్‌లో ధడక్ సినిమా తొలిభాగానికి సంబంధించిన షూట్‌ను పూర్తి చేశారు.

 ధడక్ షూటింగ్ నిలిచిపోయిందని

ధడక్ షూటింగ్ నిలిచిపోయిందని

ధడక్ సినిమా షూటింగ్‌ను మళ్లీ ప్రారంభించాం. శ్రీదేవి మరణంతో సినిమా ఆగిపోయిందనే రూమర్లలో వాస్తవం లేదు. ముంబైలో షూటింగ్ చేస్తున్నాం. తదుపరి షెడ్యూల్‌ను కోల్‌కతాలో ప్రారంభిస్తాం అని దర్శకుడు శశాంక్ ఖైతాన్ మీడియాతో అన్నారు.

సైరత్ చిత్రానికి రీమేక్‌గా

సైరత్ చిత్రానికి రీమేక్‌గా

మరాఠీలో ఘనవిజయం సాధించిన సైరత్ అనే చిత్రానికి ధడక్ రీమేక్. ఈ చిత్రం జూలైలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఉదయపూర్‌లో జరిగిన షూటింగ్‌కు శ్రీదేవి, బోనీకపూర్ హాజరయ్యారు. అనూహ్యంగా ఫిబ్రవరి 24న శ్రీదేవి మరణించడంతో షూటింగ్‌కు బ్రేక్ పడింది.

English summary
Janhvi Kapoor attended shooting on Thursday morning, with co-star, Ishaan Khatter, at Bandra's Carter Road, Mumbai. There were some reports that Janhvi might take a break, following her mother's death. However, she decided to continue shooting and finish before the release date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu