చీరకట్టులో మెరిసిన శ్రీదేవి కూతురు.. రాంచరణ్ పెళ్లికి లింకు ఏమిటంటే..
భావోద్వేగాల మధ్య దివంగత అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి జాతీయ సినీ అవార్డుల కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకర్షించింది. మామ్ చిత్రంలో అత్యద్భుత నటనను ప్రదర్శించినందుకు గానూ శ్రీదేవికి ఆమె మరణాంతరం కేంద్ర ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. సుమారు ఐదు దశాబ్దాల కెరీర్‌లో శ్రీదేవికి తొలి జాతీయ అవార్డు రావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఆమె లేకపోవడం అభిమానులను, కుటుంబ సభ్యులను, సన్నిహితులను విషాదానికి గురిచేసింది. అయితే జాహ్నవి తన తల్లి చీరను ధరించి ఈ అవార్డును అందుకోవడానికి వెళ్లారు. ప్రస్తుతం జాహ్నవి కట్టుకొన్న చీరెను మెగా పవర్ స్టార్ రాంచరణ్ పెళ్లికి శ్రీదేవి ధరించారట.

ప్రస్తుతం జాహ్నవి కట్టుకొన్న చీరెను మెగా పవర్ స్టార్ రాంచరణ్ పెళ్లికి శ్రీదేవి ధరించారట. ఆ చీరెను కట్టుకొని వెళ్లిన జాహ్నవి అందరిని ఆకట్టుకొన్నారు. ఈ చీరెను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. జాహ్నవి ఫొటోను మనీష్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశారు.

జాతీయ ఉత్తమ సినీ అవార్డుల కార్యక్రమం గురువారం (మే 3వ తేదీ) రోజున దేశ రాజధాని ఢిల్లీలోని విజ్హాన్ భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తండ్రి బోని కపూర్, సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి జాహ్నవి హాజరయ్యారు. తన తల్లికి లభించిన అవార్డును రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకొన్నారు.


Click it and Unblock the Notifications











