twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గణేష్ ఉత్సవాలకు ఆ సినీ కుటుంబం దూరం.. ఎందుకో వివరించిన సీనియర్ హీరో

    |

    వినాయక చవితి అంటే ఎంతో ప్రత్యేకమైన పండుగ అని చెబుతుంటారు. దీనికి కారణం హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఆది దేవుడు అంటారు. అందుకే ఆయన పూజతోనే అన్ని పనులు ప్రారంభిస్తారు. అది ఏ రంగమైనా సరే..గణపతి పూజ ఉండాల్సిందే. ఇక, సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే సినిమా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తమ సినిమా ప్రారంభం రోజు గణపతి పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేస్తారు. ప్రాంతీయ భాషా ఇండస్ట్రీల నుంచి బాలీవుడ్ వరకు అందరూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

    అయితే, ఈ సంవత్సరం మాత్రం ఓ సినీ కుటుంబం ఈ పండుగకు దూరంగా ఉంటోంది. ఇంతకీ వాళ్లెవరనే కదా మీ సందేహం..? బాలీవుడ్‌కు చెందిన కపూర్ కుటుంబమే ఈ ఉత్సవాలకు దూరంగా ఉంది. వాస్తవానికి ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కపూర్ ఫ్యామిలీ ఎంతో ఘనంగా నిర్వహించేది. తమ సొంతదైన ఆర్కే స్టూడియోలో ఈ వేడుకలను జరిపేవారు. ఈ కుటుంబంలోని అందరూ పండుగ రోజు అక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతీష్టించడంతో పాటు నవ రాత్రులు పూజలు జరిపించేవారు.

    Kapoors Family Wont Celebrate Ganesh Chaturthi

    గత సంవత్సరం కూడా ఇలానే వేడుకలు చేశారు. కానీ, కొద్దిరోజుల కిందట ఆర్కే స్టూడియోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇది జరిగిన కొద్దిరోజులకు ఆ స్టూడియోను కపూర్ ఫ్యామిలీ అమ్మేసింది. దీంతో ఈ సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు చేయలేకపోతున్నారు. ఈ విషయాన్ని రణ్‌ధీర్ కపూర్ స్వయంగా వెల్లడించారు.

    ఈ మేరకు ఓ మీడియా సంస్థతో అతడు ప్రత్యేకంగా మాట్లాడారు. 'మాకు గణపతి అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రతి సంవత్సరం ఆయన పండుగను అందరం కలిసి జరుపుకుంటాం. నాన్న (రాజ్ కపూర్) గారు 70 ఏళ్లుగా వేడుకను జరుపుతున్నారు. అయితే, మా ఆర్కే స్టూడియోను అమ్మేసిన తర్వాత వినాయక ఉత్సహాలు చేయడానికి ఖాళీ ప్రదేశం దొరకలేదు. అందుకే ఈ సారి చేయలేకపోతున్నాం. కానీ, ఇంట్లో మాత్రం పూజలు చేసుకుంటాం' అని వెల్లడించాడు.

    English summary
    Festivity has already gripped Mumbai and parts of Maharashtra which will celebrate Ganesh Utsav starting with Ganesh Chaturthi on September 2. But it seems that Bollywood's first family, the Kapoors, who have been keeping the family tradition alive, have bid adieu to Bappa during the Ganesh Utsav in 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X