twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గే’ అంటే నచ్చదా? మీతో మాకు ఇబ్బందే... స్టార్ డైరెక్టర్ సంచలనం!

    |

    బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ 'అన్ సూటబుల్ బాయ్' పేరుతో విడుదలైన బయోగ్రఫీలో తన సెక్సువాలిటీ గురించి ఓపెన్‌గా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ బుక్ రిలీజ్ తర్వాత తాను గే అని చెప్పుకోవడానికి ఈ స్టార్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏ మాత్రం సంకోచించడం లేదు. కరణ్ జోహార్ ఇటీవల అర్బాజ్ ఖాన్ టాక్ షో పాల్గొన్నారు. తనపై, తన సెక్సువాలిటీపై వచ్చే ట్రోల్స్ తనను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో వెల్లడించారు.

    తిడుతూనే ఉంటారు, వాటిని ఎంజాయ్ చేస్తాను

    తిడుతూనే ఉంటారు, వాటిని ఎంజాయ్ చేస్తాను

    నా మీద, నా సెక్సువాలిటీ మీద ట్రోలింగ్ జరిగినపుడు... కోపం, అసహనంతో వాటిని డీల్ చేయవచ్చు. కానీ వాటిని ఉదాసీనంగా తీసుకుంటే.. ఆ ట్రోల్స్ కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి రోజూ నేను తిట్లతోనే నిద్రలేస్తాను. అవి నాకు వినోదాన్ని కలిగిస్తాయి... అని కరణ్ జోహార్ పేర్కొన్నారు.

    గే అంటే నచ్చడం లేదా? మీలాంటి వారితో మాకు ఇబ్బందే

    గే అంటే నచ్చడం లేదా? మీలాంటి వారితో మాకు ఇబ్బందే

    ఇది నా జీవితం, నా లైంగికత గురించి మాట్లాడే హక్కు నాకు ఉంది. అయితే స్థాయి మించిన హోమోఫోబియాతో మాట్లాడే వారు నాకు సమస్యగా అనిపిస్తారు. నా సెక్సువాలిటీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అది మాట్లాడు, అందులో తప్పులేదు. కానీ ‘గే' అనే పదం నీకు ఇబ్బందిగా అనిపిస్తే మీ మైండ్ సెట్ సరిగాలేని అర్థం. అలాంటివారితోనే అసలు సమస్య. అలా ఇబ్బంది పడటం అంటే మీకు ఏమీ తెలియదని, మీ ఆలోచన ప్రక్రియ నిరక్షరాస్యుల వలె ఉందని అర్థం... అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు.

    నాకేదో సమస్య ఉందని చూడొద్దు

    నాకేదో సమస్య ఉందని చూడొద్దు

    నువ్వు నా గురించి మాట్లాడు అందులో తప్పులేదు. కానీ నేను గే కాబట్టి నాకేదో సమస్య ఉందని, నా వల్ల ఏదో తప్పు జరుగుతుంది అనే విధంగా మాట్లాడితే మాత్రం వారి నోరు మూయిస్తాను... అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చారు.

    త్వరలో గే మూవీ

    త్వరలో గే మూవీ

    గతంలో కరణ్ జోహార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘గే' సబ్జెక్టుతో సినిమా తీయాలనే కోరిక ఉందని, హోమో సెక్సువల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, ఇద్దరు లీడింగ్ యాక్టర్లతో ఈ చిత్రం చేయబోతున్నట్లు వెల్లడించారు. అయితే ఎవరు నటిస్తారో ఇప్పుడే చెప్పలేను, కానీ ఆ సినిమా తప్పకుండా చేస్తాను అన్నారు.

    English summary
    "It is my prerogative to talk about my life, my sexuality, my orientation. It is up to me. What I have a problem with is that there's a level of homophobia and that really bothers me because that's to me is sick. I mean you can talk about what you think my sexuality is, that is your prerogative, but if you are commenting and making gay sound bad that's when I have a problem because that means you have a sick mind, an uninformed mind, and an uneducated thought process." Karan Johar said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X