Just In
Don't Miss!
- News
వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం -కుటుంబాలపై ఇలా రాయొచ్చా? నీతిమాలిన చర్యలంటూ..
- Sports
షకీబుల్ అరుదైన రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్లో ఏకైక ప్లేయర్‌గా!!
- Finance
ఈఎస్ఐ పథకంలో చేరిన 9.33 లక్షల మంది.. డేటా రిలీజ్
- Automobiles
ఆటోమేటిక్ టెయిల్‌గేట్ కలిగి ఉన్న భారతదేశపు మొట్టమొదటి హ్యుందాయ్ క్రెటా, ఇదే
- Lifestyle
Republic Day 2021:చరిత్ర తిరగరాస్తున్న నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేయనున్న ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
భయపడుతూనే వర్మకు ఫోన్ చేశా.. ఆయనలా మాట్లాడతారని ఊహించలేదు: ప్రముఖ నిర్మాత
వివాదాస్పద వీరుడు, సంచలన దర్శకుడిగా ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు అందరికీ సుపరిచితం రామ్ గోపాల్ వర్మ. ఆయన సినిమా తీసినా, ఏం మాట్లాడినా అందులో ఏదో ఒక కొత్త విషయం మాత్రం ఉండే ఉంటుందనడంలో అతిశయోక్తిలేదు. అలాంటి ఈయన.. ఓ అవసరం నిమిత్తం ప్రముఖ నిర్మాత ఫోన్ చేస్తే ఊహించని విధంగా మాట్లాడాడట. మరి ఆ నిర్మాత ఎవరు? అసలు మ్యాటర్ ఏంటి? వివరాలు చూద్దామా..

ఫాలోవర్స్‌తో పాటు విమర్శకులు
ఎప్పుడూ ఏదో ఒక సందర్భంపై మాట్లాడటం, వివాదాలు రేపడం వర్మ స్టైల్. అందుకే ఆయనకు ఫాలోవర్స్‌తో పాటు తిట్టుకునే వారు కూడా ఉంటారు. అయితే వర్మలో ఓ మంచి మనిషి కూడా దాగి ఉన్నాడని అంటున్నారు ప్రముఖ బాలీవుడ్

వర్మ గురించి మాట్లాడిన కరణ్ జోహార్
ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ ‘భూత్: ది హాంటెడ్ షిప్' అనే హార్రర్ సినిమాను తెరకెక్కించారు నిర్మాత కరణ్ జోహార్. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 21న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వర్మ గురించి మాట్లాడారు కరణ్ జోహార్.

గతంలో వర్మ.. ఓ సారి అడిగి చూద్దామని అనుకుంటే
ఇదే టైటిల్‌తో 2003లో వర్మ ఓ సినిమా తెరకెక్కించారు. అయితే తన సినిమాకు ఏ టైటిల్ బాగుంటుందని ఫైనల్ అవుతుండగా ‘భూత్: ది హాంటెడ్ షిప్' అనే టైటిల్ గుర్తుకొచ్చిందని కరణ్ అన్నారు. గతంలో వర్మ ఇదే టైటిల్ పెట్టుకున్నారు కాబట్టి.. వాడేసుకుందామా అంటే వర్మ ఏమంటారోనని భయపడ్డానని, సరే.. ఓ సారి అడిగి చూద్దామని భయపడుతూనే వర్మకు ఫోన్ చేస్తే ఆయనిచ్చిన సమాధానం విని ఆశ్చర్యపోయానని కరణ్ చెప్పారు.

వర్మ క్యారెక్టర్ చూసి..
తాను వర్మకు కాల్ చేసి మీ టైటిల్ వాడుకోవచ్చా? అని అడగగానే.. నీకు నా సినిమాలకు సంబంధించిన ఏ టైటిల్ కావాలన్నా తీసుకో. ఏ పేపర్‌లో సంతకం పెట్టమన్నా పెడతాను అని ఆయన చెప్పారని కరణ్ పేర్కొన్నారు. ఆయన అంత బాగా మాట్లాడతారని ఊహించలేదని, ఆయన మంచితనానికి ఫిదా అయ్యానని కరణ్ తెలిపారు.

ఇంత అనుభవం ఉంది.. కానీ అలాంటి మనిషిని చూడలేదు
తాను చిత్ర పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. అంతటి మంచి మనిషిని ఇప్పటిదాకా చూడలేదని పేర్కొంటూ వర్మను ఆకాశానికెత్తారు కరణ్ జోహార్. దీంతో వర్మ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. కరణ్‌కి సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెబుతున్నారు. ఏదేమైనా వర్మ గురించి మాట్లాడి తన సినిమాను సూపర్‌గా ప్రమోట్ చేసుకున్నాడు కరణ్.