twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రైవేట్ పార్ట్స్ ఫోటోస్ వద్దు, మీటూపై కరణ్ జోహార్...చాలా పెద్ద పురాణమే చెప్పాడు!

    |

    మీటూ ఉద్యమంపై ఎట్టకేలకు ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ నోరు విప్పారు. గత నెల రోజులుగా బాలీవుడ్లో మీటూ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నా, ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చినా మౌనం వహించిన కరణ్ జోహార్ చివరకు స్పందించారు.

    'కాలింగ్ కరణ్' పేరుతో నిర్వహించిన ఓ రేడియలో షోలో పాల్గొన్న కరణ్ జోహార్‌కు ఓ కాలర్ నుంచి ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది? మీటూ ఉద్యమం జరుగుతోంది, లైంగిక వేధింపులు అంటున్నారు. హరాస్మెంటుతో తావు లేకుండా ఈ విషయంలో ఎదుటి వ్యక్తి సమ్మతి పొందడం ఎలా? అంటూ అనే ప్రశ్నకు కరణ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

    అడగకుండా ఎలా ఉంటాం?

    అడగకుండా ఎలా ఉంటాం?

    ‘ఇతురుల సమ్మతి పొందాలంటే ముందు వారిని ఈ విషయమై అడగాలి. ‘నీకు ఇది ఓకే నా?' లేదా ‘నువ్వు ఇది కావాలనుకుంటున్నావా?' అని అడగాలి. అయితే వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బర్ కమ్యూనికేషన్ కూడా ఇద్దరు వ్యక్తులు అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇది బేసిక్ ప్రోసీజర్. ఎవరైనా మీతో చాలా క్లోజ్‌గా ఉన్నపుడు, ఇంటిమేట్‌గా ప్రవర్తించినపుడు.... నీకు సమ్మతి ఉందా? అని అడగకుండా ఎలా ఉంటాం? అని కరణ్ జోహార్ వ్యాఖ్యానించారు.

    అలా చేయడం సరికాదు

    అలా చేయడం సరికాదు

    మీటూ ఉద్యమం నేపథ్యంలో ఎవరి పేర్లు ప్రస్తావించకుండా కరణ్ జోహార్ మాట్లాడారు. ‘మీ ప్రైవేట్ పార్ట్స్ ఫోటోలు ఎవరికైనా పంపడం సరికాదు, ఎవరైనా మద్యం సేవించిన ఉన్నపుడు వారిని ముద్దాడటం, అసభ్యంగా టచ్ చేయడం కూడా మంచి పద్దతి కాదు. అశ్లీల పదజాలంతో కూడిన సందేశాలు పంపడం కూడా మంచిది కాదు. ఎవరైనా మీ ప్రవర్తన వల్ల అసౌకర్యానికి గురవుతున్నా కూడా వారిని ఇబ్బంది పెట్టడం అంతకన్నా మంచింది కాదు... అని కరణ్ జోహార్ తెలిపారు.

    మీ పరిధి తెలుసుకోండి

    మీ పరిధి తెలుసుకోండి

    ఇతరులు మీకు సెట్ చేసిన పరిధి ఏ మేరకు ఉన్నాయో తెలుసుకోవాలి. దాని ఆధారంగానే అసలు అడగాలా? వద్దా? అనేది నిర్ణయించుకోవాలి. అదే సమయంలో మీరు సమ్మతి అడిగినపుడు ఇతరులు చెప్పే సమాధానాన్ని కూడా గౌరవించాలి అని కరణ్ జోహార్ అన్నారు.

    అలా చేయడం కూడా లైంగిక వేధింపులే

    అలా చేయడం కూడా లైంగిక వేధింపులే

    సెక్స్ అంశం లేకుండా సమ్మతి కోరడం కూడా సెక్సువల్ హరాస్మెంటుతో సమానం. అది మాథ్స్ లాంటిది, అది అంత సులభమైనది కాదు అని కరణ్ జోహార్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

    English summary
    When a caller asked Karan Johar about how to get consent on his radio show Calling Karan, the filmmaker said, "So how do you get consent? You ask for it! You have to ask, 'Are you ok with this?' or 'Do you want to do this'. It's important for people to understand both, the verbal as well as the non-verbal communication they get from someone they're with. These are the basics; basics that we often tend to forget. When you come close to someone, when you're about to get intimate, how can you not ask for consent?"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X