twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరణ్ ఇంట్లో కరోనా కలకలం.. ఇద్దరికి వైరస్.. వారు ఎవరంటే!

    |

    ఆర్థిక రాజధాని ముంబై మహానగరాన్ని కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ఈ మహమ్మారి బారిన సినీ ప్రముఖులు కూడా పడుతున్నారు. నిర్మాత కరీం మోరానీ, బోనికపూర్ తర్వాత తాజాగా దర్శక, నిర్మాత కరణ్ జోహర్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ఈ క్రమంలో కరణ్ ట్వీట్ చేస్తూ..

     పనిమనుషులకు కరోనాతో షాక్

    పనిమనుషులకు కరోనాతో షాక్

    కొవిడ్ 19 వ్యాప్తి గురించి కరణ్ జోహర్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. నా ఇంటిలో పనిచేసే ఇద్దరు సిబ్బందికి కరోనావైరస్ సోకింది. దాంతో ఒక్కసారిగా షాక్ తిన్నాం. లక్షణాలు కనిపించగానే వారిని మా బిల్డింగ్‌లోని ఓ గదిలోని క్వారంటైన్‌కు తరలించాం. వెంటనే కుటుంబమంతా రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకొన్నాం అని తేలింది అని కరణ్ జోహర్ ట్వీట్ చెప్పారు.

    స్వీయ గృహ నిర్బంధంలోకి

    స్వీయ గృహ నిర్బంధంలోకి

    ఇంట్లో ఇద్దరి సిబ్బందికి కరోనా సోకినందున తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాం. రానున్న 14 రోజుల పాటు మేము స్వీయ గృహ నిర్బంధంలో ఉంటాం. కరోనా మరొకరికి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నాం. బీఎంసీ అధికారులు వెంటనే స్పందించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం వారిని తమ సంరక్షణలో ఉంచుకొన్నారు. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం అని కరణ్ జోహర్ తెలిపారు.

    కుటుంబం మొత్తానికి పరీక్షలు

    కుటుంబం మొత్తానికి పరీక్షలు

    మా కుటుంబ సభ్యులందరం కొవిడ్ 19 పరీక్షలు జరిపించుకొన్నాం. మాకు అలాంటి లక్షణాలు లేవని, అలాగే కరోనా నెగిటివ్ అని తేలింది. కోవిడ్ 19 నిబంధనలు తుచ తప్పకుండా పాటిస్తున్నాం. అధికారుల సూచనలను స్ట్రిక్టుగా పాటిస్తున్నాం. మా విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావొద్దు. నా తల్లి, ఇద్దరు పిల్లలు యష్, రుహీ క్షేమం అని కరణ్ చెప్పారు.

    Recommended Video

    Vijay devarakonda - Puri Jagannath's Fighter Movie Update | VD 10
    కష్ట సమయాలు, విపత్కర పరిస్థితులు

    కష్ట సమయాలు, విపత్కర పరిస్థితులు

    దేశం ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కష్ట సమయాల్లో ఎదురయ్యే పరీక్షలను సానుకూలంగా అధిగమించాలి. ప్రతీ ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. కరోనాను మనం తరిమి కొడుతామనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి ఇంటి పట్టునే ఉంటూ సురక్షితంగా ఉండండి అంటూ కరణ్ తన ట్విట్టర్‌లో రాసిన లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Karan Johar's two workers in home tested Coronavirus Positive. Karan said, We went thru the tests. Then I got covid19 negitive. We are taking appropriate precautions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X