»   » ఆమె మొగుడు చాలా హాట్.. చాలా ఫిట్టుగా.. కరీనాకపూర్

ఆమె మొగుడు చాలా హాట్.. చాలా ఫిట్టుగా.. కరీనాకపూర్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Kohli Is My Favorite Cricketer, Says Kareena Kapoor

  బాలీవుడ్ బ్యూటీ కరీనాకపూర్ పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం వీర్ ది వెడ్డింగ్ చిత్రంలో నటిస్తున్నారు. ఈచిత్రంలో సోనమ్ కపూర్, స్వర భాస్కర్, షికా తల్సానియా‌తో కలిసి ఆమె నటిస్తున్నారు. జూన్ 1 రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ప్రమోషన్‌లో కరీనా బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అనుష్కశర్మ భర్త, క్రికెటర్ విరాట్‌పై కరీనా చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యాయి.

  విరాట్ కోహ్లీ చాలా హాట్

  విరాట్ కోహ్లీ చాలా హాట్

  వీర్ ది వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ క్రికెటర్ విరాట్ కోహ్లీ చాలా హాట్. చాలా ఫిట్‌గా ఉంటాడు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. హాలీవుడ్ నటుడు కేన్ విలియమ్సన్ అంటే కూడా తనకు బాగా ఇష్టం. అతడు కూడా హాట్‌గా ఉంటాడు అని కరీనా పేర్కొన్నారు. దీంతో అనుష్కకు పోటీ మొదలైందనే వార్తలు వినిపించాయి.

  సైఫ్ కూడా హాట్ అండ్ ఫిట్

  సైఫ్ కూడా హాట్ అండ్ ఫిట్

  అలాగే తన భర్త సైఫ్ ఆలీ ఖాన్ కూడా అంతే మొత్తంలో ఫిట్‌గా, హాట్‌గా ఉంటాడు అని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. తన భర్త జూనియర్ పటౌడీ అంటే తనకు చాలా ప్రేమ. ఆయన తనను బాగా చూసుకొంటారు అని కరీనా చెప్పారు.

  క్రికెట్ అంటే చాలా ఇష్టం

  క్రికెట్ అంటే చాలా ఇష్టం

  అంతేకాకుండా తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. గతంలో ఈ క్రీడను జెంటిల్మన్ గేమ్‌గా భావించే వారు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న తీరు నాకు నచ్చదు. ఇప్పటి క్రికెట్ యుద్ధపోరును తలపిస్తుంటుంది అని కరీనా అన్నారు. గతంలో సైఫ్ అలీఖాన్ పటౌటి తండ్రి మన్సూర్ ఆలీ ఖాన్ భారత జట్టుకు నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే.

  వీర్ దే వెడ్డింగ్‌లో

  వీర్ దే వెడ్డింగ్‌లో

  ప్రస్తుతం కరీనా కపూర్ వీర్ దే వెడ్డింగ్‌తోపాటు షారుక్ ఖాన్‌తో జీరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పెళ్లి, కలతలు, కలహాలు నేపథ్యంగా తెరకెక్కింది. శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రియా కపూర్, నిఖిల్ ద్వివేది, ఏక్తా కపూర్, శోభా కపూర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

  English summary
  Virat Kohli is loved by many across the world, and the cricketer has found a fan in Kareena Kapoor Khan too. In promotion of Veere Di Wedding, She confessed that he finds Virat Kohli hot. Kareena will be next seen in Veere Di Wedding along with Sonam Kapoor, Swara Bhasker and Shikha Talsania.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more